Russia-Ukraine War: ఢిల్లీలోని రష్యన్ ఎంబసీ వద్ద ఉద్రిక్తత.. రష్యాకు వ్యతిరేకంగా తల్లిదండ్రుల ఆందోళన
Russia-Ukraine War: దేశం కాని దేశం ఉక్రయిన్‌లో రష్యా బాంబుల వర్షం కురిపిస్తోంది. రష్యా, ఉక్రయిన్‌ల మధ్య యుద్ధంతో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంటే.. భారతీయులు(Indians) అమ్మో అని భయపడుతున్నారు..

Russia-Ukraine War: దేశం కాని దేశం ఉక్రయిన్‌లో రష్యా బాంబుల వర్షం కురిపిస్తోంది. రష్యా, ఉక్రయిన్‌ల మధ్య యుద్ధంతో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంటే.. భారతీయులు(Indians) అమ్మో అని భయపడుతున్నారు. తాజాగా దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లోని రష్యన్ ఎంబసీ( Russian Embassy) వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. ఉక్రయిన్‌లో చదువుకుంటున్న విద్యార్థుల తల్లిదండ్రులు రష్యా ఎంబసీ వద్దకు చేరుకున్నారు. పలువురు తల్లిదండ్రులు ఉక్రెయిన్ పై యుద్ధం చేస్తున్న రష్యాకు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. ఉక్రెయిన్లోని తమ పిల్లల పరిస్థితిపై ఆందోళన, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే పోలీసులు స్పందించి.. తల్లిదండ్రులు రష్యాలోని ఎంబసీకి చేరుకోకుండా బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. ఆందోళన చేస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులను అడ్డుకున్నారు. దీంతో అక్కడ తల్లిదండ్రులకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడంతో ఎంబసీలోకి వెళ్లకుండా పోలీసులు తల్లిదండ్రులను అడ్డుకొని అరెస్ట్ చేసి.. అక్కడ నుంచి తరలించారు.
మరోవైపు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్ లో ఉన్న భారతీయులను క్షేమంగా స్వదేశానికి తరలించేందుకు చర్యలు మొదలు పెట్టింది. ప్రత్యేక విమాన సర్వీసులను పంపేందుకు నిర్ణయం తీసుకుంది. అంతేకాదు ఇలా తరలింపు కోసం అయ్యే భారతీయులందరి ప్రయాణ ఖర్చులు మొత్తం కేంద్రమే భరించనున్నది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది.
Also Read: