SVRRGG Hospital Tirupati Jobs: రాతపరీక్షలేకుండానే.. పది, ఇంటర్‌ అర్హతతో తిరుపతి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగాలు..

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన తిరుపతిలోని ఎస్‌వీఆర్‌ఆర్‌ ప్రభుత్వ ఆసుపత్రి (SVRRGG Hospital)ఒప్పంద, ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది..

SVRRGG Hospital Tirupati Jobs: రాతపరీక్షలేకుండానే.. పది, ఇంటర్‌ అర్హతతో తిరుపతి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగాలు..
Ap Jobs
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 25, 2022 | 6:48 PM

Tirupati SVRR Recruitment 2022: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన తిరుపతిలోని ఎస్‌వీఆర్‌ఆర్‌ ప్రభుత్వ ఆసుపత్రి (SVRRGG Hospital)ఒప్పంద, ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 28

పోస్టుల వివరాలు: ఫిజిసిస్ట్‌/న్యూక్లియర్‌ ఫిజిసిస్ట్‌, రేడియోలాజికల్‌ ఫిజిసిస్ట్‌, ల్యాబ్‌ టెక్నాషియన్‌, ఫార్మసిస్ట్‌, డెంటల్‌ టెక్నీషియన్‌, స్పీచ్‌ థెరపిస్ట్‌, డయాలసిసి టెక్నీషియన్‌, ఆపరేషన్‌ థియేటర్‌ అసిస్టెంట్‌ తదితర పోస్టులు.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 42 ఏళ్లకు మించరాదు.

పే స్కేల్‌: నెలకు రూ.12,000ల నుంచి రూ.28,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి పది, ఇంటర్‌, డిప్లొమా, బీఎస్సీ, ఎమ్మెస్సీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే వ్యాలిడ్‌ గేట్ స్కోర్‌, సంబంధిత టెక్నికల్‌ నాలెడ్జ్‌ ఉండాలి.

ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్‌, అనుభవం, రిజర్వేషన్‌, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్‌: SVRR Government General Hospital, Tirupati, Chittoor district

దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 28, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

DRDO – ADE Jobs: రాతపరీక్షలేకుండానే డీఆర్‌డీవోలో ఉద్యోగాలు.. నెలకు రూ.54వేల వరకు జీతం..