DRDO – ADE Jobs: రాతపరీక్షలేకుండానే.. గేట్ స్కోర్ ఆధారంగా డీఆర్డీవోలో ఉద్యోగాలు.. నెలకు రూ.54వేల వరకు జీతం..
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన బెంగళూరులోని డీఆర్డీఓ-ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ (ADE) పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది..
DRDO – ADE Bengaluru Recruitment 2022: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన బెంగళూరులోని డీఆర్డీఓ-ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ (ADE) పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 10
పోస్టుల వివరాలు: రీసెర్చ్ అసోసియేట్ (RA): 1 జూనియర్ రీసెర్చ్ ఫెలో (JRF): 9
విభాగాలు: ఏరోనాటికల్/మెకానికల్ ఇంజనీరింగ్, ఈసీఈ, ఈఈఈ, మెకానికల్, ఎంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్.
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 25 నుంచి 38 ఏళ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్: రీసెర్చ్ అసోసియేట్లకు నెలకు రూ.54,000, జూనియర్ రీసెర్చ్ ఫెలోలకు నెలకు రూ.31,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెసలైజేషన్‌లో బీఈ/బీటెక్/ఎంఈ/ఎంటెక్, పీహెచ్‌డీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే వ్యాలిడ్ గేట్ స్కోర్, సంబంధిత టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు నేరుగా ఇంటర్వ్యూకు హాజరవ్వాలి.
ఇంటర్వ్యూ తేదీ: 2022, మార్చి 20, 16 తేదీల్లో ఇంటర్వ్యూలు జరుగుతాయి.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: