Pulse Polio: తల్లిదండ్రులకు అలర్ట్.. రేపే పల్స్ పోలియో కార్యక్రమం.. పూర్తి వివరాలు..
Pulse Polio: కరోనా (corona) కేసులు దాదాపు తగ్గముఖం పడిన నేపథ్యంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించేందుకు రెండు తెలుగు రాష్ట్రాల వైద్యాధికారులు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగానే ఆదివారం (ఫిబ్రవరి 27) పల్స్ పోలియో...

Pulse Polio: కరోనా (corona) కేసులు దాదాపు తగ్గముఖం పడిన నేపథ్యంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించేందుకు రెండు తెలుగు రాష్ట్రాల వైద్యాధికారులు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగానే ఆదివారం (ఫిబ్రవరి 27) పల్స్ పోలియో (Pulse Polio) కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని తెలంగాణ ఆర్థిక, వైద్య, ఆరోగ్యశాఖల హంత్రి హరీశ్ రావు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. 0-5 ఏళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయనున్నట్లు ఆయన తెలిపారు. ఇదిలా ఉంటే ఆదివారం ఈ కార్యక్రమం నిర్వహించిన అనంతరం రెండు రోజుల పాటు (సోమ, మంగళవారం) ఆరోగ్య సిబ్బంది ఇంటింటికీ తిరిగి, పోలియో చుక్కలు తీసుకొని చిన్నారులను గుర్తించి వేయనున్నారు. రాష్ట్రంలో మొత్తం 38 లక్షల మందికిపై చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలని వైద్యారోగ్యశాఖ లక్ష్యంగా పెట్టుకుంది.
ఇందుకుగాను రాష్ట్రవ్యాప్తంగా హెల్త్ సెంటర్లు, అంగన్‌వాడీలు, ప్రభుత్వ పాఠశాలలు, లైబ్రరీలు, బస్టాండ్లు, ఎయిర్ పోర్టులు, పర్యాటకప్రాంతాల్లో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లోనూ పల్స్ పోలియో కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడానికి అధికారులు సన్నద్ధం అవుతున్నారు. 0-5 ఏళ్ల చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నారు. ఏపీలో కూడా ముందు బూత్‌ల వద్ద పోలియో చుక్కలు వేయనున్నారు. అనంతరం రెండు రోజుల పాటు డోర్ టు డోర్ వెళ్లనున్నారు. తల్లిదండ్రులు ఈ విషయాన్ని గుర్తించి తమ పిల్లలకు కచ్చితంగా పోలియో వేసేలా జాగ్రత్తపడాలని అధికారులు సూచించారు.
Also Read: Balakrishna: మరోసారి డ్యూయల్ రోల్‌లో అదరగొట్టనున్న నట సింహం
Chanakya Niti: కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కుటుంబ సభ్యులు కూడా శత్రువులుగా మారతారంటున్న చాణక్య