AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నకిలీ పత్రాలు సృష్టించి.. రూ.2కోట్లు విలువైన స్థలాన్ని కాజేసి.. ఆఖరుకు

నకిలీ పత్రాలతో(Fake documents) రిజిస్ట్రేషన్లు చేయించి, అక్రమాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్టు(Arrest) చేశారు. ముగ్గురు మహిళలు కలిసి సుమారు రూ.2 కోట్ల విలువైన...

నకిలీ పత్రాలు సృష్టించి.. రూ.2కోట్లు విలువైన స్థలాన్ని కాజేసి.. ఆఖరుకు
Land Kabja 1
Ganesh Mudavath
|

Updated on: Feb 26, 2022 | 6:41 AM

Share

నకిలీ పత్రాలతో(Fake documents) రిజిస్ట్రేషన్లు చేయించి, అక్రమాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్టు(Arrest) చేశారు. ముగ్గురు మహిళలు కలిసి సుమారు రూ.2 కోట్ల విలువైన స్థలాన్ని కబ్జా చేశారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్(Hyderabad) నగరంలోని సరూర్‌నగర్‌ ఆర్‌కే పురం ప్రాంతానికి చెందిన వరలక్ష్మికుమారికి.. రామంతాపూర్‌లోని శ్రీరమణపురంలో 267 గజాల ఇంటి స్థలం ఉంది. దీనిని 1983లోనే కొనుగోలు చేసి ప్రహరీ నిర్మించారు. 2011లో ఆమె భర్త మృతి చెందడంతో అప్పటి నుంచి ఆమె సోదరుడు స్థలాన్ని చూసుకుంటున్నారు. ఈ స్థలంపై ఉప్పల్‌ డివిజన్‌లోని చర్చికాలనీలో ఉండే జ్యోతి, మరో కొందరికి కన్ను పడింది. ఎలాగైనా స్థలాన్ని కాజేయాలని పన్నాగం పన్నారు. దీంతో 2014లోనే వరలక్ష్మి మృతి చెందినట్లు ధ్రువీకరణ పత్రాన్ని సృష్టించారు. వరలక్ష్మి ఏకైక కూతురిని తానేనంటూ జ్యోతి నటించడం ప్రారంభించింది.

గతేడాది డిసెంబరు 3న జ్యోతి తన కూతురు వెన్నెలకు ఈ స్థలాన్ని గిఫ్ట్‌ డీడ్‌ చేసింది. అదే నెల 9న వెన్నెల మరియమ్మ అనే మహిళకు సేల్‌ డీడ్‌ చేసింది. అంతటితో ఆగకుండా 18న మరియమ్మ బల్ల జ్యోతికి సేల్‌ డీడ్‌ చేసింది. విషయం తెలుసుకున్న వరలక్ష్మి బంధువులు.. ఉప్పల్‌ సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వెళ్లగా అసలు విషయం బయటపడింది. వరలక్ష్మికి కూతురు, కుమారుడు ఉన్నారు. ఈ ఘటనపై ఉప్పల్‌ పోలీసులకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో శుక్రవారం ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. మొత్తం 12 మందిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Also Read

Balakrishna: మరోసారి డ్యూయల్ రోల్‌లో అదరగొట్టనున్న నట సింహం

ప్రకృతి ప్రేమికుల కోసం దేశంలోని ఫేమస్ పర్యాటక ప్రాంతాలు

షూటింగ్ స్పాట్ లో వయ్యారి భామ.. రష్మిక మందన్న లేటెస్ట్ పిక్స్