AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chanakya Niti: కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కుటుంబ సభ్యులు కూడా శత్రువులుగా మారతారంటున్న చాణక్య

Chanakya Niti: ఆచార్య చాణక్య ( acharya chanakya ) గొప్ప పండితుడు. మంచి నైపుణ్యం కలిగిన వ్యూహకర్త. చాణుక్యుడు రచించిన చాణక్య నీతి శాస్త్రం(Niti shastra) నేటి మానవాళికి ఆదర్శనీయం. ఈ నీతి శాస్త్రంలో..

Chanakya Niti: కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కుటుంబ సభ్యులు కూడా శత్రువులుగా మారతారంటున్న చాణక్య
Chanakya Niti
Surya Kala
|

Updated on: Feb 25, 2022 | 8:41 PM

Share

Chanakya Niti: ఆచార్య చాణక్య ( acharya chanakya ) గొప్ప పండితుడు. మంచి నైపుణ్యం కలిగిన వ్యూహకర్త. చాణుక్యుడు రచించిన చాణక్య నీతి శాస్త్రం(Niti shastra) నేటి మానవాళికి ఆదర్శనీయం. ఈ నీతి శాస్త్రంలో మతం, సంస్కృతం, న్యాయం, శాంతికి సంబంధించిన అనేక అంశాల గురించి ప్రస్తావించాడు. ఆచార్య చాణక్యుడు చాణక్య నీతిలో మానవ సంబంధాలు, సమాజం, డబ్బు, స్నేహం, విద్య మొదలైన వాటి గురించి  తన నీతి శాస్త్రంలో ప్రస్తావించాడు. ఈరోజు బంధువులు కూడా మీకు శత్రువులుగా మారే కొన్ని ప్రత్యేక పరిస్థితులను కూడా ఆచార్య వివరించారు. అవి ఏమిటో ఈరోజు తెలుసుకుందాం..

  1. చాణక్య నీతిలో.. ఆచార్య చాణక్యుడు ఒక శ్లోకం ద్వారా కొన్ని ప్రత్యేక పరిస్థితులలో మీ ప్రియమైన తల్లి, కొడుకు, భార్య, తండ్రి మొదలైన వారు కూడా మీ శత్రువులని చెప్పాడు.
  2. ఋణ కర్తా పితా శత్రు: మాతా చ వ్యభిచారిణీ భార్యా రూపవతీ శత్రు: పుత్ర: శత్రురపండిత:  శ్లోకం అర్ధం అప్పు చేసి, మనకి ఆస్తి కాకుండా అప్పు మిగిల్చే తండ్రి మనకి శత్రువుతో సమానం. వ్యభిచరించే తల్లి శత్రువు. రూపవతి అయిన భార్య శత్రువు. పండితుడు కాని కుమారుడు శత్రువు ని చెప్పాడు.
  3. ఈ శ్లోకం ద్వారా ముందుగా తండ్రిని ఉద్దేశించి ఆచార్య మాట్లాడుతూ అప్పులు చేసి తిరిగి చెల్లించని తండ్రి,  బలవంతంగా కొడుకుపై భారం మోపుతూ.. అలాంటి కొడుకు జీవితం ఎప్పుడూ బాధాకరమే. అలాంటి తండ్రి ఆ కొడుకుకు శత్రువు కంటే తక్కువ కాదని అర్ధం.
  4. తల్లి తన పిల్లల మధ్య ఎప్పుడూ వివక్ష చూపదని అంటారు. కానీ పిల్లల మధ్య వివక్ష చూపే తల్లి కూడా తన పిల్లలకు శత్రువు లాంటిది. అంతే కాకుండా భర్తతో కాకుండా వేరొకరితో సంబంధం పెట్టుకున్న తల్లి కూడా కొడుకుకు శత్రువు లాంటిది. అలాంటి తల్లిని నమ్మడం మూర్ఖత్వం.
  5. మీ భార్య చాలా అందంగా ఉండి.. భార్య ముందు భర్త తక్కువ స్థాయిలో ఉన్నట్లు అయితే భార్య అందం చాలాసార్లు సమస్యగా మారుతుంది. భర్త ఆమెను రక్షించలేడు. ఈ విధంగా ఆ అందమైన భార్య కూడా ఆ భర్తకు శత్రువు అవుతుంది.
  6. మూర్ఖుడు, జ్ఞానం లేని పిల్లవాడు ఎప్పటికీ అభివృద్ధి చెందలేడు. అలాంటి బిడ్డ తల్లిదండ్రులకు భారం. అలంటి పిల్లలను తల్లిదండ్రులు జీవితమంతా బలవంతంగా మోస్తారు. అలాంటి బిడ్డ తల్లిదండ్రుల జీవితానికి శాపం. ఆ పిల్లవాడు తల్లిదండ్రులకు శత్రువు కంటే తక్కువ కాదు.

Also Read:

జూబ్లీహిల్స్ శ్రీ వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు.. మార్చి 1నుంచి ప్రారంభం.. ఈనెల 28న అంకురార్పణ

 ‘దేవాలయాల విశిష్టతలను చాటి చెప్పడమే లక్ష్యం’.. ‘దేవాయతనం’ సదస్సు ప్రారంభించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి..