Horoscope Today: వీరికి ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి.. నేడు రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
Horoscope Today (26-02-2022): కొత్త పనులను, శుభకార్యాలు, ప్రయాణాలు, ఇలా ఏది మొదలు పెట్టాలన్నా చాలామంది మంచి చెడుల గురించి ఆలోచిస్తారు...
Horoscope Today (26-02-2022): కొత్త పనులను, శుభకార్యాలు, ప్రయాణాలు, ఇలా ఏది మొదలు పెట్టాలన్నా చాలామంది మంచి చెడుల గురించి ఆలోచిస్తారు. వెంటనే తమ దినఫలాల (Horoscope)వైపు దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (ఫిబ్రవరి 26 వ తేదీ ) శనివారం (saturday) రోజున రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..!
మేషం
ప్రారంభించబోయే పనుల్లో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. తోటివారితో వాదోపవాదాలు చేయకూడదు. మీ కుటుంబానికి మంచి పేరు ప్రతిష్ఠలు తెచ్చే పనిని మీరు నిర్వహించవచ్చు. మీరు కొత్త ఉద్యోగం నుండి చాలా విజయాలు పొందుతారు.
వృషభం
ఈ రాశి వారు గ్రహబలం మిశ్రమంగా ఉంది. మంచి ఆలోచనలతో చేసే పనులు త్వరగా సిద్దిస్తాయి. స్థానచలన సూచనలు కనిపిస్తున్నాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. కాబట్టి మీరు ఈ రోజు ఆలోచనాత్మకంగా మాట్లాడాలి. ప్రభుత్వ పనుల్లో డబ్బు పెట్టుబడి పెట్టే అవకాశాలు ఉన్నాయి.
మిథునం
ప్రారంభించిన పనులలో మంచి ఫలితాలను అందుకుంటారు. మనస్సౌఖ్యం ఉంది. బంధు,మిత్రులతో సంతోషంగా గడుపుతారు. అభివృద్ది కోసం మీరు తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి. వ్యాపారాన్ని విస్తరించడానికి మీరు మంచి ఆర్థిక ప్రణాళికను చేయవచ్చు.
కర్కాటకం
ఈ రాశి వారు సమాజంలో మీ కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. దైవభక్తి పెరుగుతుంది. అవసరానికి తగిన సహాయం అందుతుంది. ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలి. ఒక వార్త లేదా సంఘటన బాధ కలిగిస్తుంది. ఈ రోజు ఎలాంటి చర్చలకైనా దూరంగా ఉండటం సముచితం. లేకుంటే సమస్యలు రావచ్చు. పని పరిస్థితులు మెరుగుపడే అవకాశం ఉంది.
సింహం
మంచి ఫలితాలు ఉన్నాయి. ముఖ్యమైన వ్యవహారంలో అధికారుల దృష్టిని ఆకర్షిస్తారు. ఒక వ్యవహారంలో మెరుగైన ఫలితాలను పొందుతారు. శత్రువులపై విజయం సాధిస్తారు. ప్రయాణాలు ఫలిస్తాయి. భూమి, ఆస్తి సంబంధిత పనులు ఉంటాయి. మహిళలు దేశీయ వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే, ఈ రోజు మంచి రోజు అవుతుంది.
కన్య
ఈ రాశి వారు ఊహించిన ఫలితాలు రావడానికి కాస్త ఎక్కువ శ్రమించాల్సి వస్తుంది. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో తడబడతారు. ప్రారంభించిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. భగవంతుని ధ్యానం చేస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది. వ్యాపారాలలో లాభదాయక అవకాశాలు ఉంటాయి.
తుల
ఉత్సాహవంతమైన కాలాన్ని గడుపుతారు. గతంలో పూర్తికాని ఒక పని ఇప్పుడు పూర్తవుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఇష్టదైవ నామాన్ని జపిస్తే మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ రోజు ఏదైనా పని చేస్తున్నప్పుడు మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. గృహ జీవితంలో కొంత కొత్తదనం కనిపిస్తుంది.
వృశ్చికం
ఈ రాశి వారు వారి వారి రంగాల్లో విశేష ఫలితాలను సాధిస్తారు. మీ మీ రంగాల్లో అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. మొహమాటం వల్ల ఖర్చులు పెరుగుతాయి. ఆంజనేయ స్వామి ఆరాధన శుభప్రదం. అప్పుడే ఈ రోజు మీకు అన్ని విధాల బాగుంటుంది. మీ ఆదాయం బాగుంటుంది. కొంతమందికి విదేశాలకు వెళ్లే శుభవార్తలు అందుతాయి.
ధనస్సు
వృత్తి, ఉద్యోగ,వ్యాపారాది రంగాలలో అనుకూల ఫలితాలు ఉన్నాయి. తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైన పనులను పూర్తి చేయగలుగుతారు. ప్రసన్నాంజనేయ స్తోత్రం పారాయణ చేయాలి. మీ సలహా ఇతరులకు ఉపయోగపడుతుంది. మీరు వినోద సాధనాలపై ఆసక్తి కలిగి ఉంటారు.
మకరం
శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. బంధు,మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. చిన్న చిన్న విషయాలను సాగదీయకండి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఆదిత్య హృదయం చదవడం మంచిది. దీని కారణంగా మీ బంధువులు, స్నేహితులను కలిసే అవకాశం కూడా లభిస్తుంది. కుటుంబ ఆస్తులు పొందే అవకాశం ఉంది.
కుంభం
ఈ రాశి వారు భవిష్యత్తు ప్రణాళికలను అమలు చేస్తారు. ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. మనోధైర్యంతో చేసే పనులు కలిసి వస్తాయి. ఓర్పు తగ్గకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ఆంజనేయ స్వామి దర్శనం మంచి ఫలితాలను ఇస్తుంది. మీ మానసిక బద్ధకం ఈ రోజు ముగుస్తుంది. మీరు అన్ని వైపుల నుండి శుభవార్తలను అందుకుంటారు.
మీనం
అదృష్ట ఫలాలు అందుతాయి. అధికారులు మీకు అనుకూలమైన నిర్ణయాన్ని తీసుకుంటారు. కీలక వ్యవహారాలు కలిసి వస్తాయి. శ్రమ పెరగకుండా చూసుకోవాలి. శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనం శుభప్రదం. ఈ రోజు వ్యాపారం, డబ్బు కోసం మిశ్రమ రోజుగా ఉంటుంది.
Note: రాశిఫలాలు అనేవి నమ్మకానికి సంబంధించినవి.. జ్యోతిష్య శాస్త్రం చెప్పినదానికి అనుగుణంగా ఇక్కడ ఈరోజు రాశిఫలాలు ఇవ్వడం జరిగింది.
Also Read: