AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: భార్యాభర్తల దాంపత్యంలో మాధుర్యం ఏర్పడాలంటే.. బెడ్ రూమ్‌లో ఈ వస్తువులను పెట్టుకోండి

Vastu Tips: ప్రేమ(Love) భార్యాభర్తల(wife and husband)మధ్య సంబంధాన్ని పటిష్టంగా చేస్తుంది. అంతేకాదు రిలేషన్‌షిప్‌లో అవగాహన ఉంటే.. ఈజీగా కష్టాలను ఎదుర్కోవచ్చు..

Vastu Tips: భార్యాభర్తల దాంపత్యంలో మాధుర్యం ఏర్పడాలంటే.. బెడ్ రూమ్‌లో ఈ వస్తువులను పెట్టుకోండి
మరొక్క రోజు గడిస్తే 2021 ముగిసి.. 2022లోకి అడుగు పెట్టబోతున్నాం. కొత్త సంవత్సరంలో అంతా మంచే జరుగాలని ప్రతీ ఒక్కరూ ఆశిస్తారు. అయితే, కొన్నిసార్లు కొన్ని విషయాలు ఆ అదృష్టానికి అవరోధంగా పరిణమిస్తాయి. అలాంటి అవరోధాలను ఎదుర్కోవటానికి జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని వాస్తు నివారణలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Surya Kala
|

Updated on: Feb 20, 2022 | 9:34 PM

Share

Vastu Tips: ప్రేమ(Love) భార్యాభర్తల(wife and husband)మధ్య సంబంధాన్ని పటిష్టంగా చేస్తుంది. అంతేకాదు రిలేషన్‌షిప్‌లో అవగాహన ఉంటే.. ఈజీగా కష్టాలను ఎదుర్కోవచ్చు. అయితే.. కొన్నిసార్లు పరస్పర అవగాహన, సమన్వయము ఉన్నా… సంబంధంలో సమస్యలు ఏర్పడతాయి. అయితే తమ మధ్య సమస్యలు ఎందుకు పెరుగుతున్నాయో బాధిత వ్యక్తికి అర్థం కాదు. ఇలా జరగడానికి కారణం వాస్తు దోషం కూడా ఉండవచ్చు. అంతేకాదు బంధాలు వెనుక అపార్ధాలకు కారణం వాస్తుకు సంబంధించిన నియమాలు కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయయట

వాస్తు శాస్త్రంలో  చెప్పిన నియమాలను విస్మరించడం వల్ల ఆర్థిక, శారీరక సమస్యలు వస్తాయి.  వాస్తు సంబంధించిన చిట్కాలతో సంబంధాన్ని మరింత బలోపేతం చేసుకోవచ్చు. ఈరోజు బంధం బలపడడానికి వాస్తు ప్రకారం బెడ్‌రూమ్‌లో ఎలాంటి వస్తువులు ఉంచాలో తెలుసుకుందాం..

లవ్ బర్డ్స్: పేరుకి తగినట్లు లవ్ బర్డ్స్ ప్రేమకు చిహ్నం. మీరు మీ గదిలో ప్రేమపక్షిని పెట్టుకోవాలని భావిస్తే.. దానిని ఎల్లప్పుడూ నైరుతి దిశలో పెట్టుకోవాలి. అయితే ప్రేమ పక్షి విగ్రహానికి బదులు దాని బొమ్మను కూడా గదిలో పెట్టుకోవచ్చు. ఇలా చేయడం వల్ల రిలేషన్ షిప్ లో మాధుర్యం వస్తుందని, ప్రేమపూర్వక వాతావరణం ఏర్పడుతుందని నమ్మకం.

రాధా-కృష్ణ చిత్రం: ప్రేమకు చిహ్నంగా భావించే రాధా-కృష్ణుల చిత్రాన్ని బెడ్ రూమ్ లో పెట్టుకోవడం   మంచిదని నమ్మకం.  వాస్తు ప్రకారం, రాధా-కృష్ణుల చిత్రం లేదా విగ్రహాన్ని పడకగదిలో నైరుతి దిశలో పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల భార్యాభర్తల మధ్య ప్రేమ కూడా పెరుగుతుంది.

వెదురు మొక్క: వాస్తు శాస్త్రం ప్రకారం.. వెదురు మొక్క అదృష్టానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. ఇది ఇంట్లో పెంచుకుంటే కుటుంబంలో ఆనందం, సంపదను తెస్తుంది. అంతేకాదు కుటుంబ సభ్యుల మధ్య సంబంధం చక్కగా కొనసాగడానికి దోహద పడుతుంది. అయితే ఈ మొక్కను బెడ్ రూమ్ లో పెట్టుకోవాలంటే.. తూర్పు లేదా దక్షిణ దిశ మంచిది. వెదురు మొక్క ఎంత వేగంతో పెరుగుతుందో.. అదే విధంగా ఆ వ్యక్తి ఆర్థిక పురోగతి కూడా అదే వేగంతో ఉంటుందని నమ్మకం. అందుకనే ఒకసారి  వెదురు మొక్కను పెంచడం మొదలు పెడితే.. అది  ఎండిపోకుండా చూసుకోవాలి.

హిమాలయాల చిత్రం: ఇంట్లో హిమాలయ బొమ్మ పెట్టుకుంటే పాజిటివ్ ఎనర్జీ వస్తుందని నమ్మకం. పడకగదిలో హిమాలయాలకు సంబంధించిన చిత్రాన్ని ఉంచడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది.

Read Also:

 62 ఏళ్ల బామ్మ ట్రెక్కింగ్‌ చూస్తే ఫిదా.. పర్వతం ఎక్కుతున్న వీడియో వైరల్‌..