Viral Video: 62 ఏళ్ల బామ్మ ట్రెక్కింగ్ చూస్తే ఫిదా.. పర్వతం ఎక్కుతున్న వీడియో వైరల్..
Viral Video: 'కృషి ఉంటే మనుషులు రుషులవుతారు' అన్నాడు ఓ మహానుభావుడు. ఈ మాటని నిజం చేసింది ఈ 62 ఏళ్ల బామ్మ. ఏకంగా ఎత్తైన పర్వతాన్ని ఎక్కేసి అందరిని ఆశ్చర్యపరిచింది.
Viral Video: ‘కృషి ఉంటే మనుషులు రుషులవుతారు’ అన్నాడు ఓ మహానుభావుడు. ఈ మాటని నిజం చేసింది ఈ 62 ఏళ్ల బామ్మ. ఏకంగా ఎత్తైన పర్వతాన్ని ఎక్కేసి అందరిని ఆశ్చర్యపరిచింది. ట్రెక్కింగ్ అనేది యువతకు మాత్రమే సంబంధించిన ట్రెండ్. కానీ ఈ బామ్మ అలవోకగా చేసి చూపించింది. అనుకుంటే సాధించలేనిది ఏదిలేదని నిరూపించింది. ఇప్పుడు ఈ బామ్మ ట్రెక్కింగ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వివరాల గురించి తెలుసుకుందాం. బెంగళూరుకి చెందిన 62 ఏళ్ల నాగరత్నమ్మ ఫిబ్రవరి 16న పశ్చిమ కనుమలలోని శిఖరాలలో ఒకటైన 1,868-మీటర్లు (6,129 అడుగులు) అగస్త్యర్‌కూడమ్‌ను అధిరోహించి అందరిని షాక్‌కి గురిచేసింది. ఈ ట్రెక్కింగ్‌కి సంబంధించిన ఈ వీడియోని విష్ణు అనే నెటిజన్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. 62 ఏళ్ల వయస్సులో ఈ బామ్మ చేసిన సాహసం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తుంది. నాగరత్నమ్మకు పెళ్లయి 40 ఏళ్లు అవుతుంది. అయితే ఇంటి బాధ్యతల వల్ల తన కోరిక నెరవేర్చుకోలేకపోయింది. చివరకు 62 ఏళ్ల వయసులో అవకాశం వచ్చింది. దీంతో ట్రెక్కింగ్ చేసి తన కోరికని నెరవేర్చుకుంది.
కొన్ని సంవత్సరాల క్రితం తిరువనంతపురం సమీపంలోని పర్వత శ్రేణి అయిన అగస్త్యర్‌కూడం శిఖరానికి ట్రెక్కింగ్ చేయడానికి మహిళలకు అనుమతి లేదు. స్థానిక గిరిజన సంఘం భద్రతా సమస్యల దృష్ట్యా 14 ఏళ్లలోపు మహిళలు, పిల్లలను నిషేధించింది. కానీ కేరళ ధర్మాసనం ఇచ్చిన తీర్పు మేరకు 2018 చివరిలో ఈ నిబంధనలో మార్పు వచ్చింది. తర్వాత ట్రెక్కింగ్ కోసం అనుమతి వచ్చింది. ఇప్పుడు బామ్మ సాహసోపేతంగా ఆ పర్వత శ్రేణిని అధిరోహించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
View this post on Instagram