Fixed Deposits: ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల వడ్డీ రేట్లు పెరుగుదల.. ఏ బ్యాంకు ఎంత పెంచిందంటే..?

Fixed Deposits: ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు చేసేందుకు ఎంతో మంది ఆసక్తి చూపుతుంటారు. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై బ్యాంకులు వడ్డీ రేట్లని పెంచాయి. వివిధ బ్యాంకులకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పరిమితి,

Fixed Deposits: ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల వడ్డీ రేట్లు పెరుగుదల.. ఏ బ్యాంకు ఎంత పెంచిందంటే..?
Follow us

|

Updated on: Feb 20, 2022 | 8:28 PM

Fixed Deposits: ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు చేసేందుకు ఎంతో మంది ఆసక్తి చూపుతుంటారు. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై బ్యాంకులు వడ్డీ రేట్లని పెంచాయి. వివిధ బ్యాంకులకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పరిమితి, డిపాజిట్‌ కాలపరిమితిని బట్టి వడ్డీ రేట్లు మారుతూ ఉంటాయి. యాక్సిస్‌ బ్యాంకు, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకులు ప్రస్తుతం ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై మంచి వడ్డీ రేట్లు అందిస్తున్నాయి.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌

హెచ్‌డీఎఫ్‌సీ కొన్ని రకాల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీరేట్లను పెంచింది. రూ.2 కోట్ల కన్నా తక్కువ డిపాజిట్లపై వడ్డీరేట్లను 5-10 బేసిస్‌ పాయింట్ల మేర సవరిస్తున్నట్టు తెలిపింది. ఫిబ్రవరి 14 నుంచి ఇవి అమల్లోకి వచ్చాయని వెల్లడించింది. ఏడాది కాల పరిమితితో కూడిన డిపాజిట్లపై వడ్డీరేటును 10 బేసిస్‌ పాయింట్లు పెంచడంతో 4.9 శాతంగా ఉన్న వడ్డీ 5 శాతానికి పెరిగింది. ఇక రెండేళ్ల కాల పరిమితి ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల వడ్డీరేట్లనూ 5 శాతానికి పెంచారు. 2-3 ఏళ్ల కాల పరిమితి డిపాజిట్ల వడ్డీరేటును 5.20 శాతంగానే ఉంచారు. 3-5 ఏళ్ల కాల వ్యవధితో కూడిన డిపాజిట్లపై వడ్డీరేటును 5 బేసిన్‌ పాయింట్లు సవరించి 5.45 శాతానికి పెంచారు. 5-10 ఏళ్ల ఎఫ్‌డీలపై వడ్డీరేటు 5.60 శాతంగా ఉంది.

ఎస్బీఐ

ఎస్బీఐ దీర్ఘకాల ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల వడ్డీరేట్లను 15 బేసిస్‌ పాయింట్ల మేర సవరించింది. పెంచిన వడ్డీరేట్లు ఫిబ్రవరి 15 నుంచి అమల్లోకి వచ్చాయి. 3-5 ఏళ్ల ఎఫ్‌డీలపై వడ్డీరేటును 5.30 నుంచి 5.45 శాతానికి పెంచింది. సీనియర్‌ సిటిజన్లకు 5.80 నుంచి 5.95 శాతానికి పెంచారు. ఇక 2-3 ఏళ్ల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీరేటును 10 బేసిస్ పాయింట్లు సవరించారు. గతంలో 5.10 శాతం వడ్డీ ఇస్తుండగా ఇప్పుడది 5.45కు పెరిగింది. సీనియర్‌ సిటిజన్లకు 5.80 నుంచి 5.95కు పెంచారు. రెండు నుంచి మూడేళ్లలోపు ఎఫ్‌డీలపై 10 బేసిస్‌ పాయింట్లు పెంచారు. గతంలో 5.10 శాతం వడ్డీ ఇస్తుండగా ఇప్పుడది 5.20 శాతానికి పెరిగింది. సీనియర్‌ సిటిజన్లకు ఇది 5.60 నుంచి 5.70కు పెరిగింది. 5 నుంచి 10 ఏళ్ల ఎఫ్‌డీల వడ్డీ రేటు 5.40 నుంచి 5.50కు పెంచారు. సీనియర్‌ సిటిజన్లకు 6.20 నుంచి 6.30 శాతానికి పెంచారు. పెంచిన వడ్డీరేట్లు రూ.2 కోట్ల కన్నా తక్కువ విలువైన ఎఫ్‌డీలకే వర్తిస్తాయి.

Knowledge Photos: ఐస్ క్రీం తిన్న తర్వాత తలనొప్పి మొదలవుతుంది.. ఎందుకో తెలుసా..?

High BP: హై బీపీ తగ్గాలంటే ఈ ఆహారాలు తప్పనిసరి.. అవేంటంటే..?

Health News: ఆ ట్యాబ్లెట్లు అధికంగా మింగుతున్నారా.. అధ్యయనంలో షాకింగ్‌ నిజాలు..?

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో