Viral Video: వరుడి మెడలో దండవేయబోయి.. అల్లరి పాలైన అమ్మాయి.. నెట్టింట్లో సరదా వీడియో వైరల్..
Viral Video: భారతదేశం(Bharath)లో ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్.. దీంతో ఎక్కడ చూసినా అంగరంగ వైభవంగా వివాహ వేడుకలు జరుగుతున్నాయి. అయితే ఈ వేడుకల సమయంలో కొన్ని సరదా సన్నివేశాలు సోషల్ మీడియాలో..
Viral Video: భారతదేశం(Bharath)లో ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్.. దీంతో ఎక్కడ చూసినా అంగరంగ వైభవంగా వివాహ వేడుకలు జరుగుతున్నాయి. అయితే ఈ వేడుకల సమయంలో కొన్ని సరదా సన్నివేశాలు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా పెళ్లిలో చోటు చేసుకున్న ఓ ఫన్నీ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో కనిపించింది . ఈ వీడియో చూసిన వారు నవ్వకుండా ఉండలేరు.
వివాహ వేడుక సమయంలో వరుడు.. వధువుకి సింధూరం దిద్దడానికి రెడీ అవుతున్నాడు. ఇంతలో సడన్ గా అక్కడ ఓ యువతి చేతిలో దండను పట్టుకుని ప్రత్యక్షమైంది. ఆ యువత తన చేతిలోని దండను వరుడిమేడలో వేయడానికి ప్రయత్నించింది. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ చోటు చేసుకుంది… ఆ యువతిని, ఆమె చేస్తున్న పనిని గమనించిన ఆ పెళ్లి కొడుకు.. వెంటనే అక్కడనుంచి తప్పుకుని వెనక్కి వచ్చాడు. వరుడు అంత ఫాస్ట్ గా రెస్పాన్స్ అవుతాడని అంచనా వేయని.. ఆ యువతి.. వరుడి మెడలో దండ వేయడానికి ప్రయత్నించి.. ఆ వేదికలలో వెల్లకిలా పడిపోయింది. దీంతో షేమ్ గా ఫీలై.. ఆ అమ్మాయి అక్కడ నుంచి వెనక్కి వెళ్ళింది.
పెళ్లి జరిగిన ప్లేస్, సమయం లేని ఈ వీడియో “wwe స్పెషల్ మూమెంట్స్” క్యాప్షన్ పేరుతో షేర్ చేశారు.
View this post on Instagram
Also Read: