Hyderabad: మరోసారి మంచి మనసు చాటుకున్న పోలీసులు.. గ్రీన్ ఛానల్‌తో 7కి. మీ దూరాన్ని 7 నిమిషాల్లో.. గుండె తరలింపు
Hyderabad:హైదరాబాద్ పోలీసులు(Hyderabad Police)తమ మానవత్వాన్ని మరోసారి చాటుకున్నారు. సాటి మనిషికి ప్రాణం నిలిపే అవకాశం వస్తే.. తాము ఎంత వేగంగా స్పందిస్తామో మరోసారి నిరూపించుకున్నారు..
Hyderabad:హైదరాబాద్ పోలీసులు(Hyderabad Police)తమ మానవత్వాన్ని మరోసారి చాటుకున్నారు. సాటి మనిషికి ప్రాణం నిలిపే అవకాశం వస్తే.. తాము ఎంత వేగంగా స్పందిస్తామో మరోసారి నిరూపించుకున్నారు. గ్రీన్ ఛానెల్(Green channel)ను ఏర్పాటు చేసి స్వల్ప సమయంలోనే గుండెను అతివేగంగా తరలించి సక్సెస్ అయ్యారు. ఏడు కిలోమీటర్ల దూరాన్ని గ్రీన్ ఛానల్ ద్వారా ఏడు నిమిషాల్లో రీచ్ అయ్యేలా పక్కాగా ప్లాన్ చేశారు. హైదరాబాద్ సోమాజీగూడ యశోద హాస్పిటల్ నుంచి జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి గ్రీన్ ఛానల్ ద్వార గుండెను గ్రీన్ ఛానల్ ద్వారా తరలించారు. 11.27 నిమిషాలకు యశోదా హాస్పిటల్ నుంచి గుండె తరలింపు కార్యక్రమం మొదలు పెట్టి.. 11.34 కల్లా గుండెను అపోలోకి చేర్చారు. అంబులెన్స్ ఏడు కిలోమీటర్ల దూరాన్ని ఏడు నిమిషాల్లో ప్రయాణించి గుండెను భద్రంగా అపోలోకి తరలించింది.
ఈ సంవత్సరం లో ఇప్పటివరకు 7 సార్లు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసినట్టు హైద్రాబాద్ ట్రాఫిక్ పోలీసులు చెప్పారు. గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసిన.. సక్సెస్ ఫుల్ గా గుండెను తరలించినందుకు ట్రాఫిక్ పోలీసులను ఆసుపత్రి వర్గాలు అభినందించాయి. ఇలా గుండెను తరలించడానికి తమకు సహకరించిన ప్రజలకు హైద్రాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమేషనర్ ధన్యవాదాలు తెలిపారు. మంచి మనసుతో అవయవదానానికి ముందుకురావడంతో మరో ప్రాణం నిలబడుతుంది. ఇందుకు వైద్యులు కూడా తమ వంతు పాత్ర పోషించడంతో పలువురు ఈ ప్రక్రియను అభినందిస్తున్నారు.
Also Read: శివయ్య భక్తులకు గుడ్ న్యూస్.. శివరాత్రికి శైవ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు..