Hyderabad: బంజారాహిల్స్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రమాదం.. కారు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం
Hyderabad Drunk and Drive: ఎన్నిసార్లు చెప్పినా.. పోలీసులు ఎంత కఠిన చర్యలు తీసుకున్నా .. డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రమాదాలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి.
Hyderabad Drunk and Drive: ఎన్నిసార్లు చెప్పినా.. పోలీసులు ఎంత కఠిన చర్యలు తీసుకున్నా .. డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రమాదాలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. మందుబాబుల తీరులో మార్పులు రావడం లేదు. దీంతో అమాయకులు బలైపోతున్నారు. తాజాగా హైదరాబాద్ లో మరో డ్రంకెన్ డ్రైవ్ ప్రమాదం చోటుచేసుకుంది. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2 లో అర్ధరాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది. కారు అదుపుతప్పి దూసుకురావడంతో.. అదే సమయంలో నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరిని ఢీకొట్టింది. దీంతో వాళ్లు స్పాట్‌లోనే చనిపోయారు. మృతులు.. రెయిన్ బో హాస్పిటల్ లో పనిచేస్తున్న అయోధ్య రాయ్, దీపక్ గా పోలీసులు గుర్తించారు. ఒడిశా రాష్ట్రానికి చెందిన దేవేందర్ దాస్ 4 నెలల క్రితం రెయిన్బో హాస్పిటల్ లో క్యాంటీన్ లో కుక్ గా పని చేస్తున్నాడు. ఉత్తరప్రదేశ్ చెందిన అజోధ్య రాయ్ సర్వీస్ బాయ్ గా నాలుగు సంవత్సరాల నుండి పని చేస్తున్నాడు. రాత్రి ఆస్పత్రి నుంచి డ్యూటీ ముగించుకొని ఇంటికి వెళ్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదం జరిగింది.
ప్రమాదంలో ఖరీదైన కారు తుక్కు తుక్కు అయింది. ఫ్రంట్ అద్దాలు బ్రేక్ అయ్యాయి. ముందు భాగాలు ఎక్కడికక్కడ ఊడిపోయాయి. సిట్యువేషన్ చూస్తుంటే కారు ఎంత స్పీడ్‌లో ఉందో అర్థమవుతుంది.
రియల్ ఎస్టేట్ వ్యాపారి రోహిత్.. ఫుల్‌గా మద్యం తాగి ఓవర్ స్పీడ్‌లో డ్రైవ్ చేసి.. ప్రమాదం చేసినట్టు పోలీసులు గుర్తించారు. అతనిని అదుపులోకి తీసుకున్న బంజారాహిల్స్ పోలీసులు.. కేసు నమోదు చేశారు.మొత్తానికి ఓ మందుబాబు తప్పిదానికి ఇద్దరి ప్రాణాల్లో గాల్లో కలిసిపోగా.. వారి కుటుంబాలు రోడ్డునపడ్డాయి. మద్యం తాగి వాహనం నడిపి ఇద్దరి ప్రాణాలు బలితీసుకున్న వ్యక్తిని కఠినంగా శిక్షించాలన్న డిమాండ్ వినిపిస్తోంది.
TS 08 HR 3344 అనే నంబర్ ఉన్న పోర్షే కారు ఖరీదు కోటి పైమాటే. ఇలాంటి కారే డ్యామేజ్ అయిందంటే ప్రమాదం సమయంలో ఏంత స్పీడ్‌లో ఉందో తెలిసిపోతుంది. ర్యాష్ డ్రైవింగ్ మాత్రమే కాదు ఈ కారు ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ట్రాఫిక్స్ రూల్స్ పాటించకుండా జిబ్రా లైన్‌పై ఎలా నిలిపారో చూడండి. ఇప్పటికీ కారుపై ట్రాఫిక్ చలానాలు కూడా ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి.
Also Read..
Omicron Variant: ఒమిక్రాన్ వేరియంట్.. కాస్త ఊరటను ఇచ్చే అంశం..