Omicron Variant: ఒమిక్రాన్ వేరియంట్.. తెలుగు రాష్ట్రాలు అప్రమత్తం.. కాస్త ఊరటను ఇచ్చే అంశం.!

బ్రిటన్ నుంచి ఇటీవల హైదరాబాద్‌కు వచ్చిన మహిళకు ఒమిక్రాన్ వేరియంట్ నిర్ధారణ కాలేదని వైద్యశాఖ అధికారులు వెల్లడించారు...

Omicron Variant: ఒమిక్రాన్ వేరియంట్.. తెలుగు రాష్ట్రాలు అప్రమత్తం.. కాస్త ఊరటను ఇచ్చే అంశం.!
Omicron
Follow us

|

Updated on: Dec 06, 2021 | 11:17 AM

బ్రిటన్ నుంచి ఇటీవల హైదరాబాద్‌కు వచ్చిన మహిళకు ఒమిక్రాన్ వేరియంట్ నిర్ధారణ కాలేదని వైద్యశాఖ అధికారులు వెల్లడించారు. జీనోమ్ సీక్వెన్స్ రిపోర్టులో ఆమెకు ఒమిక్రాన్ వేరియంట్ నెగటివ్ వచ్చిందని.. మరో 12 మంది రిపోర్టులు ఇవాళ వచ్చే అవకాశం ఉన్నాయని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. విదేశాల నుంచి హైదరాబాద్ వచ్చినవారిలో ఈ మహిళకు కరోనా పాజిటివ్ రావడంతో.. ఆమెను టీమ్స్ ఆసుపత్రికి తరలించి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ప్రపంచ దేశాలను ఒమిక్రాన్‌ వేరియంట్‌ దడ పుట్టిస్తోంది. తొలుత దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఈ వేరియంట్‌ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే ఒమిక్రాన్‌ వేరియంట్‌ 46 దేశాలకు పాకింది. ప్రపంచవ్యాప్తంగా 722 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. ఇటు దేశంలో కూడా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి. నిన్న ఒక్కరోజే కొత్తగా 17 కేసులు నమోదు కాగా.. మొత్తంగా ఈ కేసుల సంఖ్య 21కి చేరింది. మహారాష్ట్రలో 7, రాజస్థాన్‌లో 9, కర్ణాటకలో 2, గుజరాత్‌, ఢిల్లీల్లో ఒక్కో కేసు వెలుగులోకొచ్చాయి. కాగా, దేశంలో న్యూ స్ట్రెయిన్‌ విజృంభణతో కేంద్ర ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. బూస్టర్‌ డోస్‌కు కసరత్తు చేస్తోంది. ఇవాళ కొవిడ్‌ టెక్నికల్‌ అడ్వైజరీ కమిటీ భేటీ కానుంది. బూస్టర్‌ డోస్‌తో పాటు చిన్నారుల వ్యాక్సిన్‌పైనా కమిటీ సభ్యులు చర్చించనున్నారు.