AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: కౌన్ బనేగా కాంగ్రెస్ సీఎం.. ముఖ్యమంత్రి రేసులో సీనియర్లు.. తగ్గేదేలే అంటూ..

అలకలు, కలహాలు ఇంకా చల్లారనే లేదు. ఇల్లు అలకగానే పండగయినట్టు ఎన్నికల షెడ్యూల్‌ ఇలా వచ్చిందో లేదో అలా ముఖ్యమంత్రి పదవి కోసం రేసు మొదలైంది. ఎవరికి వారు తాము సీఎం రేసులో ఉన్నామని దరువేస్తున్నారు సీనియర్లు. సీనియర్‌ జానారెడ్డి సాబ్‌... తన మన్‌ కీ బాత్‌ ఏంటో కుండ బద్దలు కొట్టారు.

Telangana: కౌన్ బనేగా కాంగ్రెస్ సీఎం.. ముఖ్యమంత్రి రేసులో సీనియర్లు.. తగ్గేదేలే అంటూ..
Telangana Congress
Ravi Kiran
|

Updated on: Oct 24, 2023 | 7:00 PM

Share

అలకలు, కలహాలు ఇంకా చల్లారనే లేదు. ఇల్లు అలకగానే పండగయినట్టు ఎన్నికల షెడ్యూల్‌ ఇలా వచ్చిందో లేదో అలా ముఖ్యమంత్రి పదవి కోసం రేసు మొదలైంది. ఎవరికి వారు తాము సీఎం రేసులో ఉన్నామని దరువేస్తున్నారు సీనియర్లు. సీనియర్‌ జానారెడ్డి సాబ్‌… తన మన్‌ కీ బాత్‌ ఏంటో కుండ బద్దలు కొట్టారు. సీఎం సీఎం అని కార్యకర్తలు నినాదాలు చేస్తున్న టైమ్‌లో.. పక్కా టైమింగ్‌తో తన స్టయిల్‌లో ఓ క్లారిటీ ఇచ్చారాయన. నేను పదవుల్ని వెదుక్కుంటూ వెళ్లను. పదవే నన్ను వెదుక్కుంటూ వస్తుందన్నారు.

జానాసాబ్‌ భరోసా కీ పీఛే క్యా హై! కర్నాటకలో సిద్దరామయ్యను వరించినట్టుగా సీనియార్టీ కోటాలో తనకు సీఎం పదవి సిద్ధిస్తుందనే ధీమాలో వున్నారా?.. మొన్నటి దాక మౌనమే నా భాష అన్నట్టుగా వున్న జానారెడ్డి.. ఇప్పుడు యాక్టివ్‌ అయ్యారు. పైగా బుజ్జగింపుల కమిటీ చైర్మన్‌గా పెద్దరికంతో కాంగ్రెస్‌ ఇంటిని చక్కదిద్దే బాధ్యతను భుజానికెత్తుకున్నారు. అలా తన బలాన్ని, బలగాన్ని పెంచుకుంటన్నారా? హైకమాండ్‌ నుంచి భరోసా సాధించారా? ఎంత ఎక్కువ మంది సీఎం పదవికి పోటీ పడితే తనకంత బలమని భావిస్తున్నారు. పోటీ ఎక్కువైతే మధ్యే మార్గంగా సీనియార్టీకి అవకాశం దక్కడం ఖాయం. అందుకు కర్నాటక కాంగ్రెస్‌ సీఎంయే నిదర్శనమనే లెక్కుందా?

సిద్దరామయ్య లెక్క జానారెడ్డికి కూడా ఛాన్స్‌ దక్కితే.. మరి పీసీసీ చీఫ్‌ రేవంత్‌ సీఎం డ్రీమ్స్‌ పరిస్థితి ఏంటీ? డీకే శివకుమార్‌ తరహాలో 5 బై 2… సెకండ్‌ టర్మ్‌ సీఎంగిరి రేవంత్‌కు దక్కుతుందా? షెడ్యూల్‌ ప్రకారమే ఎలక్షన్‌ బెల్‌ మోగింది. కానీ కాంగ్రెస్‌లో మాత్రం ముఖ్యమంత్రి రేసు ముందస్తుగానే జోరందుకుంది. రేవంత్‌ ఏకంగా టైమ్‌..డేట్‌..ప్లేస్‌తో సహా ప్రమాణ స్వీకారానికి ముహర్తం ఫిక్స్‌ చేశారు. ఇందిరమ్మ రాజ్యం ఆరు గ్యారెంటీలపై తొలి సంతకం చేస్తుందన్నారు. మరి ఆ సంతకం ఎవరదవుతుంది?. రేవంత్‌ అనే నేను.. అనడానికి రిహార్సల్స్‌ చేస్తూ లీక్‌ ఇచ్చారా? తానే సీఎంనని తెలియాల్సిన వాళ్లకు తెలిసేలా చెప్పారా? అనేది ఓ చర్చ.

గెలుపు సంగతేమో కానీ నేనే సీఎం అంటూ సీనియర్లు ఒకరెనక ఒకరు తమ మనుసులో ముచ్చట బయటపెడతున్నారు. ఇప్పుడే కావచ్చు ఎప్పుడైనా కావచ్చు… కావడం కాస్త లేటయినా సీఎం అయితీరడం మాత్రం పక్కా అంటూ కార్యకర్తలను హుషారెత్తించారు కోమటిరెడ్డి. టు టర్మ్‌ పీసీసీ చీఫ్‌ ..ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పేరు కూడా ముఖ్యమంత్రి రేసులో రీసౌండిస్తోంది. ఆ మ్యాటర్‌లో ఆయన కూడా కాన్ఫిడెంట్‌గా వున్నట్టున్నారు.

రాహుల్‌ జోడోయాత్రకు అనుబంధంగా తెలంగాణలో పాదయాత్ర చేపట్టిన భట్టి విక్రమార్క కూడా ముఖ్యమంత్రి ఆశావహుల్లో అగ్రస్థానంలో ఉన్నారు. సీఎం పదవిపై టీవీ9 బిగ్‌ న్యూస్‌ బిగ్‌ డిబెట్‌లో తన మనసులో మాట చెప్పేశారు భట్టి విక్రమార్క. దళితులకు ముఖ్యమంత్రి పదవి అనే పాయింట్‌పై రాజకీయంగా హాట్‌ హాట్‌చర్చ జరుగుతోంది. ఆ బాటలో భట్టికి సీఎంఛాన్స్‌ గ్యారెంటీ అని గట్టి నమ్మకంతో వున్నారు ఆయన అనుచరులు.ఇక వై నాట్‌ మీ.. సీఎం కా రేస్‌ మే మై హుంనా అంటే సింహగర్జన చేశారు జగ్గారెడ్డి. తూర్పు పడమరైనా.. పడమర తూర్పైనా ఈ విషయంలో తగ్గేదే లే అన్నట్టుగా సంకేతాలిచ్చారు తూర్పుజయప్రకాశ్‌ రెడ్డి ఫ్రమ్‌ సంగారెడ్డి . పదేళ్లకైనా సరే ముఖ్యమంత్రిని అయితీరుతానన్నారు

ఎవరి నమ్మకం వాళ్లదే. మరి ముఖ్యమంత్రి రేసులో బీసీ ఆవాజ్‌ ఏది? ఎక్కడ? మాణిక్‌రావ్‌ ఠాక్రే చెప్పినట్టుగా కాంగ్రెస్‌లో అందరూ సీఎం అభ్యర్ధులే!. ఏ లీడర్‌ని కదిపినా మాకేం తక్కువ అనే మాట వినిపిస్తోంది. ఎవరికి వాళ్లు తామే ముఖ్యమంత్రి అభ్యర్ధి అంటారు. అనడమే కాదు… కార్యకర్తలతోనూ నినాదాలు కూడా చేయించుకుంటారు. 2014, 2018 ఎన్నికల్లో ఇదే జరిగింది, ఇప్పుడు 2023లోనూ అదే జరుగుతోంది. కాంగ్రెస్‌లో సీనియర్ల సీఎం డ్రీమ్స్‌ ఫ్రేమ్‌లో ఇంకెన్ని వాయిస్‌లు తెరపైకి రానున్నాయో.