Himayat – Osman Sagar : హిమాయత్, ఉస్మాన్ సాగర్ రిజర్వాయర్లకు భారీగా వరద నీరు , మరిన్ని గేట్లు ఎత్తివేత

భాగ్యనగర జంట జలాశయాలు నీటితో తొణికిసలాడుతున్నాయి. ఉస్మాన్ సాగర్(గండిపేట), హిమాయత్ సాగర్‌లకు భారీగా వరద వచ్చి చేరుతోంది. భారీ వర్షాలు.. వరద నీటి ప్రవాహంతో హిమాయత్ సాగర్..

Himayat - Osman Sagar : హిమాయత్,  ఉస్మాన్ సాగర్ రిజర్వాయర్లకు భారీగా వరద నీరు , మరిన్ని గేట్లు ఎత్తివేత
Gandipet
Follow us
Venkata Narayana

|

Updated on: Jul 22, 2021 | 7:51 PM

Himayat Sagar – Osman Sagar : భాగ్యనగర జంట జలాశయాలు నీటితో తొణికిసలాడుతున్నాయి. ఉస్మాన్ సాగర్(గండిపేట), హిమాయత్ సాగర్‌లకు భారీగా వరద వచ్చి చేరుతోంది. భారీ వర్షాలు.. వరద నీటి ప్రవాహంతో హిమాయత్ సాగర్ నిండు కుండలా మారింది. గరిష్ఠ స్థాయికి హిమాయత్ సాగర్ నీరు చేరడంతో ఇప్పటికే రెండు గేట్లు ఎత్తగా, ఇవాళ మూడు గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. హిమాయ‌త్ సాగ‌ర్ పూర్తి స్థాయి నీటి మ‌ట్టం – 1763.50 అడుగులు కాగా, ప్రస్తుత స్థాయి: 1762.60 (2.715 టిఎంసి) ఉండగా, ఇన్‌ఫ్లో: 300 క్యూసెక్స్.. అవుట్ ఫ్లో: 1030 క్యూసెక్స్ ఉంది.

ఉస్మాన్ సాగర్‌కు ఎగువ ప్రాంతాల నుండి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో జలమండలి అధికారులు ఇప్పటికే రెండు గేట్లు ఎత్తి.. 180 క్యూసెక్కుల వ‌ర‌ద నీటిని మూసి నది లోకి విడుదల చేశారు. ఇవాళ మూడు గేట్లు ఎత్తి రెండు అడుగుల మేర నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. ఇప్పటికే జలాశయం పూర్తి స్థాయిలో నిండిపోవడంతో గండిపేట జలాశయం పరివాహక ప్రాంతంలో హై అలెర్ట్ ప్రకటించారు. చాదరఘాట్, హైదర్ షా కోర్ట్, ముసారం బాగ్ ప్రాంతాల్లో వరద హెచ్చరికలు జారీ చేశారు.

భారత వాతావరణ శాఖ నివేదిక ప్రకారం రాబోయే రెండు రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో మరింత వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. దీంతో హిమయత్‌సాగర్ రిజర్వాయర్ లోకి కూడా భారీ ఎత్తున వరద నీరు వచ్చి చేరే అవకాశం ఉంది. ఫలితంగా జ‌ల‌మండ‌లి అధికారులు.. సంబంధిత రెవెన్యూ అధికారుల‌ను అప్రమ‌త్తం చేశారు.

హిమాయ‌త్ సాగ‌ర్ లోత‌ట్టు ప్రాంతాల్లో ఉన్న కాల‌నీలు, మురికివాడ ప్రాంతాలు, మూసీ న‌ది ప‌రివాహ‌క ప్రాంత ప్రజ‌ల‌ను వెంట‌నే సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించాల‌ని, అందుకు అవ‌స‌ర‌మైన స‌హాయ‌క చ‌ర్యలు చేప‌ట్టేందుకు సన్నద్ధం కావాల‌ని హైద‌రాబాద్, రంగారెడ్డి జిల్లాల‌ ప‌రిపాల‌నా యంత్రాంగంతో పాటు.. జీహెచ్‌ఎంసీ, పోలీసు అధికారుల‌కు సూచించారు.

Read also : Telangana Rains : నిర్మల్ జిల్లా ఆటోనగర్ రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్..! బైంసా యువత సాయంతో ప్రాణాలతో బయటపడ్డ 12 మంది పోలీసులు

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!