Hyderabad: హైదరాబాద్‌లో హైఅలెర్ట్.. రంగంలోకి క్విక్ రియాక్షన్ టీమ్ & రాపిడ్ యాక్షన్ ఫోర్స్
అసదుద్దీన్ ఓవైసీ కారుపై కాల్పుల ఘటన నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. పాతబస్తీలో నిఘా కట్టుదిట్టం చేశారు. క్విక్ రియాక్షన్ టీమ్ & రాపిడ్ యాక్షన్ ఫోర్స్‌ను అందుబాటులో ఉంచారు.
Attack On Asaduddin Owaisi: ఐదు రాష్ట్రాల ఎన్నికల వేళ ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కారుపై దుండగలు కాల్పులు జరపడం కలకలం రేపింది. ఎలాంటి ప్రాణప్రాయం జరగకపోయినా.. దుండగుల దాడి సంచలనంగా మారింది. అసదుద్దీన్ ఓవైసీ కారుపై కాల్పుల ఘటన నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు(Hyderabad Police) అప్రమత్తమయ్యారు. పాతబస్తీ(Old City)లో నిఘా కట్టుదిట్టం చేశారు. ముందస్తు చర్యల్లో భాగంగా ఎక్కడ ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భారీగా బలగాలను మొహరించారు. పాతబస్తీ, చార్మినార్(Charminar), మక్కా మసీద్ తదితర ప్రాంతాల్లో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. క్విక్ రియాక్షన్ టీమ్ & రాపిడ్ యాక్షన్ ఫోర్స్‌ను అందుబాటులో ఉంచారు. నైట్ పెట్రోలింగ్‌తో పాటు అదనంగా ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసులు, ప్లాటూన్ దళాలు అక్కడికి చేరుకున్నాయి. ఇవాళ శుక్రవారం కావడం పోలీసులకు మరింత చాలెంజింగ్‌గా మారింది. చార్మినార్‌కు 4 దిక్కులు 4 పోలీస్ స్టేషన్ ల పరిధిలోకి వస్తుండటంతో అన్ని స్టేషన్‌ల పోలీసులు చార్మినార్ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. పాతబస్తీ పేరు చెబితే.. ముందు ఒవైసీ సోదరుల పేరు వినిపిస్తుంది. అసదుద్దీన్ ఓవైసీ కారుపై దాడితో ఓల్డ్ సిటీలో దాడులు జరిగే ప్రమాదం ఉందన్న అంచనాల నేపథ్యంలో బందోబస్తు పెంచారు.
దాడిని ఖండిస్తూ ఓల్డ్ సిటీలో MIM శ్రేణులు రోడ్డెక్కాయి. దాడికి పాల్పడ్డ వారిని పట్టుకోవాలని డిమాండ్ చేశాయి. మీరు భయపెడితే భయపడే వ్యక్తిని కాదు.. నా చావుకి సమయం సందర్భం రాసి ఉంటుంది అంటూ రెండు రోజుల క్రితం ఉత్తర ప్రదేశ్ బహిరంగసభలో కామెంట్ చేశారు ఓవైసీ. వెంటనే ఈ ఘటన చోటు చేసుకోవడం కలకలం రేపింది. గతంలో అసదుద్దీన్ తమ్ముడు అక్బరుద్దీపైనా కాల్పులు జరిగాయి. హైదరాబాద్ కేంద్రంగా అక్బరుద్దీన్‌పై ఎటాక్ జరగగా.. ఈ ఘటన నుంచి త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. అసదుద్దీన్ టార్గెట్‌గా జరిగిన దాడిని రాజకీయ పార్టీలన్నీ ఖండించాయి. ఇదొక పిరికిపంద చర్యగా అభివర్ణించారు కేటీఆర్.
Also Read: APSRTC: తిరుమలకు వెళ్లే వెంకన్న భక్తులకు ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ ఆఫర్.