బాబోయ్‌ వాన..! హైదరాబాద్‌ను వణికిస్తున్న వరుణుడు.. జీహెచ్‌ఎంసీ అలర్ట్

మంగళవారం తెల్లవారు జాము 3గంటల నుంచి మొదలైన వర్షం మధ్యాహ్న సమయంలో కాస్త ఊరటించింది. ఇక సాయంత్రానికి ఒక్కసారిగా మబ్బులు కమ్మేసి కుమ్మరించింది. హైదరాబాద్ వ్యాప్తంగా ఒక్కసారిగా ఉరుములు,మెరుపులతో వర్షం పడింది. ఏకదాటిగా కురిసిన వర్షానికి నగరంలో ఎక్కడ చూసిన ఆగి ఉన్న నీళ్లతో చెరువులను తలపించింది. ఎక్కడ మ్యాన్ హోల్ ఉందో.. ఎక్కడ రోడ్డులు ఉన్నాయో తెలియకుండా పోయింది.

బాబోయ్‌ వాన..! హైదరాబాద్‌ను వణికిస్తున్న వరుణుడు.. జీహెచ్‌ఎంసీ అలర్ట్
Rains
Follow us

| Edited By: Shaik Madar Saheb

Updated on: Aug 20, 2024 | 9:37 PM

గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో భాగ్యనగరం అతలాకుతలమైంది. మంగళవారం నగరంలో మరోసారి కుండపోత వర్షం కుమ్మరించింది. సోమవారం కురిసిన వర్షానికే ఇంకా నగరవాసులు కోలుకోలేదు. మళ్లీ వర్షం కురుస్తుండటంతో ప్రజలు వణికిపోతున్నారు. మంగళవారం సాయంత్రం పంజాగుట్ట, బేగంపేట, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌ ప్రాంతాల్లో కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఎటు చూసిన మోకాళ్లలోతు వరద నీటి ప్రవాహంతో వాహనదారులు నరకయాతన పడ్డారు. పలు చోట్ల ట్రాఫిక్‌ స్తంభించడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది.. జీహెచ్‌ఎంసీ అధికార యంత్రాంగం, డీఆర్‌ఎఫ్‌ బృందాలు అప్రమత్తమయ్యాయి.

సికింద్రాబాద్ లోని జవహర్ నగర్, పాపయ్య నగర్, సంతోష్ నగర్ లో వర్షపు ఇళ్లలోకి వచ్చి చేరింది. అటు, మలక్​పేట ప్రధాన రహదారి రైల్వే బ్రిడ్జి కింద భారీగా వరద నీరు చేరడంతో ట్రాఫిక్‌ తీవ్ర అంతరాయం ఏర్పడింది. వెంకటేశ్వరనగర్, ఇందర్​సింగ్ నగర్, వాణినగర్​లలో ఇళ్లలోకి వరద నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ప్రశాంతి నగర్ వద్ద నాలా పొంగి రహదారుల్లోకి వరద నీరు ప్రవహిస్తోంది. భారీ వర్షానికి సనత్​నగర్ నుంచి వ్యక్తి మృతదేహం కొట్టుకొచ్చింది.

ఇవి కూడా చదవండి

మంగళవారం తెల్లవారు జాము 3గంటల నుంచి మొదలైన వర్షం మధ్యాహ్న సమయంలో కాస్త ఊరటించింది. ఇక సాయంత్రానికి ఒక్కసారిగా మబ్బులు కమ్మేసి కుమ్మరించింది. హైదరాబాద్ వ్యాప్తంగా ఒక్కసారిగా ఉరుములు,మెరుపులతో వర్షం పడింది. ఏకదాటిగా కురిసిన వర్షానికి నగరంలో ఎక్కడ చూసిన ఆగి ఉన్న నీళ్లతో చెరువులను తలపించింది. ఎక్కడ మ్యాన్ హోల్ ఉందో.. ఎక్కడ రోడ్డులు ఉన్నాయో తెలియకుండా పోయింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..