సికింద్రాబాద్‌‌లో 11 మంది గర్భిణులకు క్వారంటైన్..రీజ‌న్ ఇదే

సికింద్రాబాద్‌‌లో 11 మంది గర్భిణులకు క్వారంటైన్..రీజ‌న్ ఇదే

సికింద్రాబాద్‌‌లోని ఈస్ట్ మారేడ్ పల్లిలో 11 మంది గర్భిణులను గృహ నిర్భందం చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇటీవ‌లి కాలంలో 102 వాహనంలో 13 మంది గర్భిణులు వివిధ ఆసుపత్రులకు ప్ర‌యాణించారు. ట్రీట్మెంట్ కోసం వెళ్లిన వీరిలో ఇద్దరికి ప్రసవం అయింది. అయితే ఈ గర్భిణులను తీసుకువెళ్ళిన 102 వాహ‌నం డ్రైవర్‌కు కోవిడ్-19 పాజిటివ్ అని తేల‌డంతో ఈ 11 మందిని గృహ నిర్భందం చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. వీళ్లందరికీ కూడా నిత్యం మెడికల్ టెస్టులు నిర్వహిస్తున్నారు. […]

Ram Naramaneni

|

May 01, 2020 | 9:21 AM

సికింద్రాబాద్‌‌లోని ఈస్ట్ మారేడ్ పల్లిలో 11 మంది గర్భిణులను గృహ నిర్భందం చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇటీవ‌లి కాలంలో 102 వాహనంలో 13 మంది గర్భిణులు వివిధ ఆసుపత్రులకు ప్ర‌యాణించారు. ట్రీట్మెంట్ కోసం వెళ్లిన వీరిలో ఇద్దరికి ప్రసవం అయింది. అయితే ఈ గర్భిణులను తీసుకువెళ్ళిన 102 వాహ‌నం డ్రైవర్‌కు కోవిడ్-19 పాజిటివ్ అని తేల‌డంతో ఈ 11 మందిని గృహ నిర్భందం చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. వీళ్లందరికీ కూడా నిత్యం మెడికల్ టెస్టులు నిర్వహిస్తున్నారు. మరోవైపు ప్ర‌సవం అయిన ఇద్దరు మహిళలకు కూడా కోవిడ్-19 టెస్టులు నిర్వహించారు. వీళ్ళందరినీ స్పెష‌ల్ వార్డులో పెట్టి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.

అయితే 102 వాహనం డ్రైవర్ కి కరోనా ఎలా సోకింది..ఎవ‌రి నుంచి సోకింది అనే విష‌యాల‌పై కూడా అధికారులు ఆరా తీస్తున్నారు. విధి నిర్వ‌హ‌ణ‌లో భాగంగా ఆస్ప‌త్రుల‌కు వెళ్ళినప్పుడు అక్కడ ఎవరైనా కరోనా పేషెంట్‌తో డ్రైవర్ కాంటాక్ట్ అయి ఉండవచ్చునని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే డ్రైవర్‌ను గాంధీ ఆసుపత్రిలో ఉంచి ట్రీట్మెంట్ అందిస్తున్నారు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu