తెలంగాణ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం..వెహిక‌ల్ టాక్స్‌పై గుడ్‌న్యూస్‌

తెలంగాణ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం..వెహిక‌ల్ టాక్స్‌పై గుడ్‌న్యూస్‌

క‌రోనా క‌ష్ట‌కాలంలో తెలంగాణ స‌ర్కార్ మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. లాక్‌డౌన్ కార‌ణంగా ఉపాధి లేక ఇబ్బందులు ప‌డుతున్న ప్రైవేటు ర‌వాణా, కార్గొ స‌ర్వీసుల య‌జ‌మానుల‌కు ప్ర‌భుత్వం ఊర‌ట‌నిచ్చేలా తాజాగా ఉత్త‌ర్వులు జారీ చేసింది. మొద‌టి మూడు నెల‌ల మోటార్ వాహ‌న పన్ను చెల్లించ‌ని వారికి వెసులుబాటును క‌ల్పించింది. వారికి మ‌రో నెల‌రోజుల గ‌డువు పెంచింది. రాష్ట్రంలో బస్సులు, లారీలు, కార్లు, ఆటోలు వంటి వాణిజ్య వాహనాలు దాదాపు 4 లక్షల వరకు ఉన్నాయి. వీటి యజమానులు […]

Jyothi Gadda

|

May 01, 2020 | 7:22 AM

క‌రోనా క‌ష్ట‌కాలంలో తెలంగాణ స‌ర్కార్ మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. లాక్‌డౌన్ కార‌ణంగా ఉపాధి లేక ఇబ్బందులు ప‌డుతున్న ప్రైవేటు ర‌వాణా, కార్గొ స‌ర్వీసుల య‌జ‌మానుల‌కు ప్ర‌భుత్వం ఊర‌ట‌నిచ్చేలా తాజాగా ఉత్త‌ర్వులు జారీ చేసింది. మొద‌టి మూడు నెల‌ల మోటార్ వాహ‌న పన్ను చెల్లించ‌ని వారికి వెసులుబాటును క‌ల్పించింది. వారికి మ‌రో నెల‌రోజుల గ‌డువు పెంచింది.

రాష్ట్రంలో బస్సులు, లారీలు, కార్లు, ఆటోలు వంటి వాణిజ్య వాహనాలు దాదాపు 4 లక్షల వరకు ఉన్నాయి. వీటి యజమానులు ప్రతి మూడు నెలలకోసారి మోటార్‌ వెహికల్‌ టాక్స్‌ను చెల్లించాలి. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏప్రిల్ 30లోపే టాక్స్ చెల్లించాల్సి ఉండగా, ఆ గడువును పెంచుతూ రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్‌శర్మ గురువారం ఉత్తర్వులను జారీ చేశారు. లాక్‌డౌన్‌ కారణంగా వాహనాలు నిలిచిపోయి నష్టాల్లో ఉన్నామని, వాహన పన్ను చెల్లింపును వాయిదా వేయాలని తెలంగాణ లారీ యజమానుల సంఘం, క్యాబ్స్‌ యజమానుల అసోసియేషన్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. దీంతో పన్ను చెల్లింపునకు నెల రోజుల గడువును ప్రభుత్వం ప్రకటించింది. ప్ర‌భుత్వ నిర్ణ‌యంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రైవేటు ర‌వాణా, కార్గొ స‌ర్వీసుల య‌జ‌మానులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu