తెలంగాణలో 13 జిల్లాల్లో కరోనా యాక్టీవ్ కేసే లేదు.. లేటెస్ట్ అప్ డేట్స్..
తెలంగాణ రాష్ట్రం కరోనాపై పోరులో సత్పలితాలను సాధిస్తోంది. గత కొన్ని రోజులుగా భారీగా తగ్గిన కేసుల సంఖ్య .. గురువారం స్పల్పంగా పెరిగింది. కొత్తగా 22 కరోనా కేసులు నమోదయ్యాయి. అవన్నీ హైదరాబాద్ నుంచే వచ్చాయని తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. ఐతే గత నాలుగు రోజులుగా జిహెచ్ఎంసి పరిధిలో మినహా ఇతర జిల్లాల్లో కొత్త కేసులు నమోదవడం లేదు. దాంతో పాటు ఇప్పటికే తక్కువ కేసులు నమోదైన జిల్లాల్లో కరోనా రోగులందరూ త్వరితగతిన కోలుకుంటున్నారు. ఈ నేపథ్యంలో […]

తెలంగాణ రాష్ట్రం కరోనాపై పోరులో సత్పలితాలను సాధిస్తోంది. గత కొన్ని రోజులుగా భారీగా తగ్గిన కేసుల సంఖ్య .. గురువారం స్పల్పంగా పెరిగింది. కొత్తగా 22 కరోనా కేసులు నమోదయ్యాయి. అవన్నీ హైదరాబాద్ నుంచే వచ్చాయని తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. ఐతే గత నాలుగు రోజులుగా జిహెచ్ఎంసి పరిధిలో మినహా ఇతర జిల్లాల్లో కొత్త కేసులు నమోదవడం లేదు. దాంతో పాటు ఇప్పటికే తక్కువ కేసులు నమోదైన జిల్లాల్లో కరోనా రోగులందరూ త్వరితగతిన కోలుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల్లో యాక్టీవ్ కేసుల సంఖ్య సున్నాగా ఉంది. ప్రస్తుతం కరోనా కేసులు లేని జిల్లాలు తెలంగాణలో 13 ఉన్నాయని వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. వీటిలో 3 జిల్లాల్లో ఇప్పటి వరకు ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. మిగిలిన 10 జిల్లాల్లో కరోనా రోగులందరూ వ్యాధి నయమై డిశ్చార్జి కావడంతో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య సున్నాగా ఉంది.
ఇప్పటి వరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాని జిల్లాలు:
1. వరంగల్ (రూరల్) 2. యాదాద్రి భువనగిరి 3. వనపర్తి
కరోనా నుంచి కోలుకొని యాక్టివ్ కరోనా కేసులు లేని జిల్లాలు:
1. సిద్దిపేట 2. మహబూబాబాద్ 3. మంచిర్యాల 4. నారాయణపేట 5. పెద్దపల్లి 6. భద్రాద్రి కొత్తగూడెం 7. ములుగు 8. నాగర్ కర్నూల్ 9. సంగారెడ్డి 10. జగిత్యాల