AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Director: డిసెంబర్ వరకు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.. లేకుంటే అంతే సంగంతి.. డీహెచ్ శ్రీనివాస్ రావు హెచ్చరిక

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు గత మూడు నెలల నుండి తగ్గుముఖం పట్టాయని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల కరోనా తీవ్రత, థర్డ్ వేవ్‎ను అడ్డుకున్నామని చెప్పారు...

Health Director: డిసెంబర్ వరకు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.. లేకుంటే అంతే సంగంతి.. డీహెచ్ శ్రీనివాస్ రావు హెచ్చరిక
Dh
Srinivas Chekkilla
|

Updated on: Oct 11, 2021 | 3:23 PM

Share

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు గత మూడు నెలల నుండి తగ్గుముఖం పట్టాయని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల కరోనా తీవ్రత, థర్డ్ వేవ్‎ను అడ్డుకున్నామని చెప్పారు. అన్ని జిల్లా ఆసుపత్రిలో పిడియట్రిక్స్ బెడ్స్ ఏర్పాటు చేసుకున్నామని పేర్కొన్నారు. దాదాపు అన్ని ఆస్పత్రుల పరిధిలో ఆక్సిజన్ బెడ్స్ ఏర్పాటు చేశామన్నారు. కరోనా రికవరీ రేటు కూడా చాలా పెరిగిందని వివరించారు. కరోనా ముందు ఉన్న పరిస్థితులు ఇప్పుడు దాదాపుగా కనిపిస్తున్నాయని చెప్పారు. నార్మల్ లైఫ్‎లోకి వస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం పండుగ సీజన్ మొదలైందని, రానున్న మూడు నెలలు పండుగలు ఉన్నాయన్నారు.

ఇప్పటికీ 200 నుండి 250 వరకు కేసులు నమోదు అవుతున్నాయన్నారు. ఇప్పటి వరకు కరోనా బారిన పడని వారు… ఇప్పుడు జాగ్రతలు పాటించకపోతే కరోనాకు వచ్చే అవకాశం ఉందన్నారు. రీసెంట్‎గా 17 ఏళ్ల అమ్మాయి కోవిడ్ బారిన పడి చనిపోయిందని తెలిపారు. ఇంకా కరోనా మొత్తం పోలేదని..జాగ్రత్తలు తప్పనిసరి తీసుకోవాలని హెచ్చరించారు. పండగలు,విందులు,షాపింగ్ చేసేటప్పుడు జాగ్రతలు తప్పనిసరిగా తీసుకోవాలని కోరారు. కుటుంబంలో ఒక్కరు కరోనా బారిన పడితే మిగతా అందరూ కరోనా బారిన పడుతున్నారని వివరించారు. ప్రస్తుతం సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయని.. లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. లేదంటే ప్రాణాపాయం తప్పదని హెచ్చరించారు. పండుగ సీజన్ కాబట్టి.. ప్రయాణాలు మొదలు అయ్యాయి.. పక్క రాష్ట్రాల్లో ఇంకా కరోనా ప్రభావం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలన్నారు.

అవసరమైతేనే ప్రయాణాలు చేయాలని పేర్కొన్నారు. డిసెంబర్ వరకు మరింత జాగ్రత్త తప్పనిసరని చెప్పారు. మాస్క్ పెట్టుకునే వారి సంఖ్య చాలా తగ్గిపోయిందని.. భౌతిక దూరం ఎక్కడ కనిపించడం లేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రెండు కోట్ల లక్ష మందికి ఇప్పటి వరకు కనీసం ఒక డోసు ఇచ్చామని శ్రీనివాస్ రావు వెల్లడించారు. 72 శాతం మందికి మొదటి డోస్ పూర్తైయిందని, 38 శాతం మందికి సెకండ్ డోస్ ఇచ్చామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా రోజుకి దాదాపు 3 లక్షల వరకు వాక్సిన్ ఇస్తున్నామని చెప్పారు. 25 లక్షల మంది సెంకడ్ డోస్ డేట్ దాటిన వాక్సిన్ తీసుకోకుండా తిరుగుతున్నారని వివరించారు. రెండు డోస్‎లు తీసుకుంటేనే సురక్షితమని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు స్పష్టం చేశారు.

Read Also.. Expand: హైద‌రాబాద్ ఎయిర్‌పోర్ట్ విస్త‌ర‌ణ‌కు జీఎంఆర్‌ రూ.6300 కోట్ల ఇన్వెస్ట్‌మెంట్‌..!