Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

HCLTech to Hyderabad: హైదరాబాద్‌లో కొత్తగా HCL టెక్ సెంటర్ ఏర్పాటు.. త్వరలోనే 5 వేల ఐటీ జాబ్స్!

తెలంగాణకు మరో కొత్త ప్రాజెక్ట్ రానుంది. గ్లోబల్ టెక్నాలజీ కంపెనీ హెచ్‌సీఎల్ హైదరాబాద్‌లో కొత్త టెక్ సెంటర్‌ను ప్రారంభించేందుకు అంగీకరించింది. ఈ మేరకు దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం తెలంగాణ పెవిలియన్‌లో సీఎం రేవంత్ రెడ్డి హెచ్‌సీఎల్ టెక్ గ్లోబల్ సీఈవో, ఎండీ సివిజయకుమార్‌తో చర్చలు జరిపారు..

HCLTech to Hyderabad: హైదరాబాద్‌లో కొత్తగా HCL టెక్ సెంటర్ ఏర్పాటు.. త్వరలోనే 5 వేల ఐటీ జాబ్స్!
HCLTech Centre to Hyderabad
Follow us
Prabhakar M

| Edited By: Srilakshmi C

Updated on: Jan 22, 2025 | 12:54 PM

హైదరాబాద్, జనవరి 22: ప్రముఖ గ్లోబల్ టెక్నాలజీ కంపెనీ హెచ్‌సీఎల్ హైదరాబాద్ లో కొత్త టెక్ సెంటర్‌ను ప్రారంభించనుంది. దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం తెలంగాణ పెవిలియన్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు, హెచ్​సీఎల్ టెక్ గ్లోబల్ సీఈవో, ఎండీ సివిజయకుమార్‌తో చర్చలు జరిపారు. హెచ్‌సీఎల్ కొత్త సెంటర్‌లో లైఫ్ సైన్సెస్, ఫైనాన్షియల్ సర్వీసెస్ సేవలకు ప్రాధాన్యమిస్తుంది. అత్యాధునిక క్లౌడ్, అర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ సొల్యూషన్‌లను అందిస్తుంది.

హైటెక్ సిటీలో 3.20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో హెచ్‌సీఎల్ కొత్త క్యాంపస్ ఏర్పాటవుతుంది. ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ నుండి గోల్డ్ సర్టిఫికేషన్‌ అందుకుంది. దీంతో దాదాపు 5,000 మంది ఐటీ నిపుణులకు ఉద్యోగాలు లభిస్తాయి. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో పాటు, ఐటీలో ప్రతిభా వంతులైన నిపుణులతో ఇప్పటికే హెచ్​సీఎల్ గ్లోబల్ నెట్​ వర్క్​ సెంటర్​ గా హైదరాబాద్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ కొత్త సెంటర్ మరింత అత్యాధునిక సామర్థ్యాన్ని అందుబాటులోకి తెస్తుందని హెచ్​సీఎల్ టెక్ సీఈవో విజయకుమార్ అభిప్రాయపడ్డారు.

రాష్ట్రంలో హెచ్​సీఎల్ సేవల విస్తరణను ముఖ్యమంత్రి ఎ.రేవంత్​ రెడ్డి స్వాగతించారు. ప్రపంచంలో ఐటీ హబ్ గా హైదరాబాద్ తన స్థానాన్ని మరోసారి పదిలం చేసుకుందని అభిప్రాయపడ్డారు. వచ్చే నెలలో కొత్త సెంటర్‌ను ప్రారంభించాలని ఆహ్వానించారు. స్థానిక యువతకు ఉద్యోగాలతో పాటు హైదరాబాద్‌లోని టెక్నాలజీ, ఇన్నోవేషన్ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఐటీ మంత్రి శ్రీధర్​ బాబు అన్నారు. ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి నగరాలకు ఐటీ పరిశ్రమను విస్తరించాలని హెచ్​సీఎల్ టెక్ ప్రతినిధులను కోరారు. ప్రభుత్వం తరఫున తగిన సహకారం అందిస్తామని చెప్పారు. 2007 నుంచే హెచ్​సీఎల్ హైదరాబాద్ నుంచి ప్రపంచ వ్యాప్తంగా తమ క్లయింట్లకు సేవలను అందిస్తోంది. కొత్త కేంద్రంతో హైదరాబాద్ లో హెచ్​సీఎల్ మొత్తం అయిదు సెంటర్లను విస్తరించనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

అబద్ధం చెప్పేవారికి యముడు ఏ శిక్ష వేస్తాడో తెలుసా..?
అబద్ధం చెప్పేవారికి యముడు ఏ శిక్ష వేస్తాడో తెలుసా..?
మీ కలలలో వీటిని చూసినట్లయితే అమ్మవారు మీ పట్ల దయతో ఉందని అర్థమట
మీ కలలలో వీటిని చూసినట్లయితే అమ్మవారు మీ పట్ల దయతో ఉందని అర్థమట
నా కొడుకును బలి పశువును చేస్తున్నారు.. పృథ్వీరాజ్ సుకుమార్ తల్లి.
నా కొడుకును బలి పశువును చేస్తున్నారు.. పృథ్వీరాజ్ సుకుమార్ తల్లి.
యూపీఐ నుండి బ్యాంకుల వరకు.. ఏప్రిల్ 1 నుండి అనేక నియమాలు మార్పు!
యూపీఐ నుండి బ్యాంకుల వరకు.. ఏప్రిల్ 1 నుండి అనేక నియమాలు మార్పు!
పాస్టర్ ప్రవీణ్ మృతి కేసులో వీడుతున్న చిక్కుముళ్లు..
పాస్టర్ ప్రవీణ్ మృతి కేసులో వీడుతున్న చిక్కుముళ్లు..
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రిజక్ట్ చేసిన టాప్ 5 సినిమాలు ఇవే!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రిజక్ట్ చేసిన టాప్ 5 సినిమాలు ఇవే!
పెళ్లివేడుకలో కూతురు ఆద్య, భార్య ఐష్‌తో కలిసి సందడి చేసిన అభిషేక్
పెళ్లివేడుకలో కూతురు ఆద్య, భార్య ఐష్‌తో కలిసి సందడి చేసిన అభిషేక్
Tv9 సమ్మిట్‌..అబుదాబిలో మోదీ ప్రసంగాన్ని విన్న లులు గ్రూప్ అధినేత
Tv9 సమ్మిట్‌..అబుదాబిలో మోదీ ప్రసంగాన్ని విన్న లులు గ్రూప్ అధినేత
వీరిని అస్సలు నమ్మకూడదు.. విదుర నీతి ఏం చెబుతుందో తెలుసా..?
వీరిని అస్సలు నమ్మకూడదు.. విదుర నీతి ఏం చెబుతుందో తెలుసా..?
ఏంటీ కీర్తి ఇలా మారిపోయింది.. బ్లాక్ చీరలో కీర్తిసురేష్ ఫొటోస్!
ఏంటీ కీర్తి ఇలా మారిపోయింది.. బ్లాక్ చీరలో కీర్తిసురేష్ ఫొటోస్!