హైదరాబాద్ ఆర్టీసీ బస్సులో గన్ షాట్స్..

హైదరాబాద్‌లోని పంజాగుట్ట దగ్గర ఆర్టీసీ బస్సులో ఓ వ్యక్తి జరిపిన కాల్పులు కలకలం సృష్టించాయి. బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరు ప్రయాణికుల మధ్య ఘర్షణ జరుగుతుండగా.. ఓ గుర్తు తెలియని వ్యక్తి గన్‌తో బస్సులో కాల్పులు జరిపాడు. బుల్లెట్ బస్సు రూఫ్ టాప్ నుంచి బయటకు దూసుకెళ్లింది. ఈ ఘటనతో బస్సులో ప్రయాణిస్తున్న వారు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. సికింద్రాబాద్ నుంచి ఫిలింనగర్ వెళ్తున్న AP 28Z 4468 బస్సులో ఈ ఘటన జరిగింది. కాల్పులు జరిపిన వ్యక్తి […]

హైదరాబాద్ ఆర్టీసీ బస్సులో గన్ షాట్స్..
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: May 02, 2019 | 12:44 PM

హైదరాబాద్‌లోని పంజాగుట్ట దగ్గర ఆర్టీసీ బస్సులో ఓ వ్యక్తి జరిపిన కాల్పులు కలకలం సృష్టించాయి. బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరు ప్రయాణికుల మధ్య ఘర్షణ జరుగుతుండగా.. ఓ గుర్తు తెలియని వ్యక్తి గన్‌తో బస్సులో కాల్పులు జరిపాడు. బుల్లెట్ బస్సు రూఫ్ టాప్ నుంచి బయటకు దూసుకెళ్లింది. ఈ ఘటనతో బస్సులో ప్రయాణిస్తున్న వారు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. సికింద్రాబాద్ నుంచి ఫిలింనగర్ వెళ్తున్న AP 28Z 4468 బస్సులో ఈ ఘటన జరిగింది. కాల్పులు జరిపిన వ్యక్తి వెంటనే పారిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు. కాల్పులకు పాల్పడింది ఎవరనే దానిపై ఆరా తీస్తున్నారు.