Hyderabad: పాత భవనాలపై జీహెచ్‌ఎంసీ ఫోకస్‌.. కొనసాగుతోన్న కూల్చివేతలు.. ఆ ప్రాంతాల్లో..

Hyderabad: భారీ వర్షాలు కురుస్తోన్న నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ (GHMC) అధికారులు పాత నిర్మాణాలపై దృష్టిసారించారు. గత కొన్ని రోజులుగా ఎడతెరపిలేకుండా కురుస్తోన్న వర్షాల కారణంగా కూలడానికి సిద్ధంగా ఉన్న...

Hyderabad: పాత భవనాలపై జీహెచ్‌ఎంసీ ఫోకస్‌.. కొనసాగుతోన్న కూల్చివేతలు.. ఆ ప్రాంతాల్లో..
Follow us
Narender Vaitla

|

Updated on: Jul 14, 2022 | 7:05 AM

Hyderabad: భారీ వర్షాలు కురుస్తోన్న నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ (GHMC) అధికారులు పాత నిర్మాణాలపై దృష్టిసారించారు. గత కొన్ని రోజులుగా ఎడతెరపిలేకుండా కురుస్తోన్న వర్షాల కారణంగా కూలడానికి సిద్ధంగా ఉన్న భవనాలను అధికారులు కూల్చేస్తున్నారు. వర్షాకాలం ప్రారంభం కాకముందే పాత భవనాలపై స్పెషల్ డ్రైవ్‌ చేపట్టిన అధికారులు, 524 భవనాలను గుర్తించారు. ప్రమాదకరంగా మారిన కట్టడాలను కూల్చేసేందుకు నోటీసులు కూడా జారీ చేశారు. ఇప్పటికే 40 నిర్మాణాలను కూల్చివేసిన GHMC అధికారులు, మిగతా వాటిపైనా చర్యలు చేపట్టారు.

అధికారులు ప్రతీ ఏటా పాత భవనాల గుర్తింపు కార్యక్రమాన్ని చేపడుతారు. ఈ ఏడాది మొత్తం 524 ప్రమాదకర భవనాలను గుర్తించారు. అందులో పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్న భవనాలను అధికారులు కూల్చేస్తున్నారు. ఇందులో భాగంగా గత రెండు రోజులుగా ఈ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటివరకు 45 పురాతన కట్టడాలను నేలమట్టం చేశారు. అలాగే, 78 భవనాలను సీజ్‌ చేసి, వాటిని ఖాళీ చేయించారు. ఇప్పటివరకు మొత్తం 185 భవనాలను కూల్చివేయగా, 300 భవనాలను ఖాళీ చేయించారు. ఇక, మిగతా బిల్డింగ్స్‌పై చర్యలు కొనసాగుతాయని, ఇంటి యజమానులు సహకరించాలని అధికారులు కోరుతున్నారు.

ఇదిలా ఉంటే ప్రతీ ఏటా వర్షకాలం వచ్చిందంటే పాత భవనాలు ప్రమాదాలకు నిలయంగా మారుతున్నాయి. గతంతో పాత భవనాలు కూలిపోయి జనాలు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఎన్నో జరిగాయి. తాజాగా కురుస్తోన్న వర్షాల కారణంగా పాత భవనాలు కూలిపోవడం వల్ల పాతబస్తీలో ఒకరు, సూరారంలో ఇద్దరు గాయపడ్డారు. దీంతో అధికారులు భవనాల కూల్చివేత ప్రక్రియను వేగవంతం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..