GG Hospital: రూపాయికే కార్పొరేట్‌ వైద్యం.. ఎక్కడో కాదు మన హైదరాబాద్‌లోనే.. భోజనం కూడా ఉచితమే..

GG Hospital: ప్రస్తుత రోజుల్లో ఆసుపత్రికి వెళ్లాంటే భయపడే రోజులు వచ్చాయి. జలుబు చేసి ఆసుపత్రికి వెళ్లినా రూ. 300 కన్సల్టేషన్‌ ఫీజులు చెల్లించాల్సిన రోజులివీ. ఇక సంబంధిత పరీక్షలు, మెడిసిన్‌ వెరసి...

GG Hospital: రూపాయికే కార్పొరేట్‌ వైద్యం.. ఎక్కడో కాదు మన హైదరాబాద్‌లోనే.. భోజనం కూడా ఉచితమే..
Gg Hospital
Follow us

|

Updated on: Sep 18, 2022 | 4:59 PM

GG Hospital: ప్రస్తుత రోజుల్లో ఆసుపత్రికి వెళ్లాంటే భయపడే రోజులు వచ్చాయి. జలుబు చేసి ఆసుపత్రికి వెళ్లినా రూ. 300 కన్సల్టేషన్‌ ఫీజులు చెల్లించాల్సిన రోజులివీ. ఇక సంబంధిత పరీక్షలు, మెడిసిన్‌ వెరసి రూ. వేలల్లో సమర్పించుకోవాల్సిందే. అయితే కేవలం ఒక్క రూపాయి కన్సల్టేషన్‌ ఫీజుతో కార్పొరేట్‌ వైద్యం అందిస్తే ఎలా ఉంటుంది.? ఏంటి జోక్‌ చేస్తున్నామనుకుంటున్నారా.? అయితే ఇది నిజంగా నిజం. డీఎస్‌ఆర్‌ అండ్‌ డీవీఆర్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ సౌజన్యంతో ఏర్పాటు చేసిన జీజీ చారిటీ హాస్పిటల్‌ పేదలకు తక్కువ ధరలో మంచి వైద్యాన్ని అందిస్తోంది.

ఇంతకీ ఈ హాస్పిటల్‌ ఎక్కడుందో చెప్పలేదు కదూ.. హైదరాబాద్‌లోని రాంగనగర్‌లో 2022 ఫిబ్రవరిలో ఈ ఆసుపత్రిని ప్రారంభించారు. కన్సల్టేషన్‌ ఫీజుగా కేవలం రూపాయి మాత్రమే తీసుకోవడం ఈ ఆసుపత్రి ప్రత్యేకత. ఆ ఒక్క రూపాయిని కూడా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన హుండీలో వేయాల్సి ఉంటుంది. 24 గంటలపాటు వైద్య సేవలు అందిస్తారు. గర్భిణులు, పిల్లలు, ఆర్థో సంబంధిత వ్యాధులకు చికిత్స అందిస్తారు. ప్రస్తుతం ఆసుపత్రిలో 18 వైద్యులు ఉన్నారు. కేవలం కన్సల్టెన్సీకి మాత్రమే పరిమితం కాకుండా ల్యాబ్‌, ఎక్స్‌రే, ఫిజియోథెరపీ, ఐసీయూ, అల్ట్రాసౌండ్‌ లాంటి పరీక్షలను కూడా తక్కువ ధరకే నిర్వహిస్తున్నారు.

అంతేకాకుండా ఆసుపత్రికి వచ్చే రోగులు, వారి సహాయకులకు ఉచితంగా భోజనం, టిఫిన్లు అందిస్తున్నారు. ఆయూష్‌, ఆరోగ్య శ్రీ పథకాలు కూడా ఇందులో అమలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఆసుపత్రికి రోజుకు 200 మంది రోగులు వస్తున్నారు. రానున్న రోజుల్లో మరిన్ని సేవలు అందుబాటులోకి తీసుకొస్తామని నిర్వాహకులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..

నాగచైతన్య-శోభిత పెళ్లి డేట్ ఫిక్స్| కటౌట్ అదిరింది. ఆల్ ది బెస్ట్
నాగచైతన్య-శోభిత పెళ్లి డేట్ ఫిక్స్| కటౌట్ అదిరింది. ఆల్ ది బెస్ట్
IPL 2025: ఢిల్లీ నుంచి రిషబ్ పంత్ ఔట్?
IPL 2025: ఢిల్లీ నుంచి రిషబ్ పంత్ ఔట్?
తెలంగాణ గ్రూప్ 3 పరీక్షల షెడ్యూల్ విడుదల..Hall Ticket విడుదల తేదీ
తెలంగాణ గ్రూప్ 3 పరీక్షల షెడ్యూల్ విడుదల..Hall Ticket విడుదల తేదీ
పాపం..ఆ రైలు వస్తుందని ఊహించలేదేమో..ఒకేసారి తండ్రి కూతురు..
పాపం..ఆ రైలు వస్తుందని ఊహించలేదేమో..ఒకేసారి తండ్రి కూతురు..
పిడుగుపాటుకు బాణాసంచా తయారీ కేంద్రంలో అగ్ని ప్రమాదం.. ఇద్దరు మృతి
పిడుగుపాటుకు బాణాసంచా తయారీ కేంద్రంలో అగ్ని ప్రమాదం.. ఇద్దరు మృతి
Gold Price Today: దీపావళి రోజున షాకిచ్చిన బంగారం ధర.. తులం ఎంతంటే
Gold Price Today: దీపావళి రోజున షాకిచ్చిన బంగారం ధర.. తులం ఎంతంటే
ఈ రాశివారికి అన్నింటా విజయాలు, పట్టిందల్లా బంగారమే..
ఈ రాశివారికి అన్నింటా విజయాలు, పట్టిందల్లా బంగారమే..
TTD నూతన ఛైర్మన్‌గా బీఆర్ నాయుడు నియామకం.. 24 మందితో కొత్త బోర్డు
TTD నూతన ఛైర్మన్‌గా బీఆర్ నాయుడు నియామకం.. 24 మందితో కొత్త బోర్డు
ఐకాన్‌ స్టార్‌ వర్సెస్‌ సూపర్‌స్టార్‌. ఈ పోటీ పై నెల్సన్ క్లారిటీ
ఐకాన్‌ స్టార్‌ వర్సెస్‌ సూపర్‌స్టార్‌. ఈ పోటీ పై నెల్సన్ క్లారిటీ
దీపావళి సేల్‌లో జిగేల్‌మనే ఆఫర్లు.. స్మార్ట్‌ఫోన్స్‌పై డీల్స్‌..
దీపావళి సేల్‌లో జిగేల్‌మనే ఆఫర్లు.. స్మార్ట్‌ఫోన్స్‌పై డీల్స్‌..