Ruby Hotel fire: రూబీ హోటల్ అగ్నిప్రమాద ఘటనకు కారణం ఇదే.. ప్రాథమిక నివేదిక విడుదల చేసిన క్లూస్‌ టీం..

ఎలక్ట్రిక్ టు వీలర్ చార్జింగ్ పెట్టినట్లు గుర్తించిన క్లూస్ టీం..చార్జింగ్ ఫుల్ అయ్యి పొగ వచ్చినట్టు నిర్ధారించింది. ఆ తర్వాత మంటలను క్రమంగా పక్కా వాహనాలకు అంటుకున్నట్లు రిపోర్ట్‌లో తేల్చారు.

Ruby Hotel fire: రూబీ హోటల్ అగ్నిప్రమాద ఘటనకు కారణం ఇదే.. ప్రాథమిక నివేదిక విడుదల చేసిన క్లూస్‌ టీం..
Ruby Hotel Fire Accident
Follow us
Sanjay Kasula

|

Updated on: Sep 18, 2022 | 1:27 PM

సికింద్రాబాద్‌ రూబీ హోటల్‌ అగ్నిప్రమాద ఘటనలో క్లూస్‌ టీం ప్రాథమిక నివేదిక సమర్పించింది. ఎలక్ట్రిక్ టు వీలర్ చార్జింగ్ పెట్టినట్లు గుర్తించిన క్లూస్ టీం..చార్జింగ్ ఫుల్ అయ్యి పొగ వచ్చినట్టు నిర్ధారించింది. ఆ తర్వాత మంటలను క్రమంగా పక్కా వాహనాలకు అంటుకున్నట్లు రిపోర్ట్‌లో తేల్చారు. విద్యుత్‌ ద్విచక్ర వాహనానికి ఛార్జింగ్‌ పెట్టినట్లు అధికారులు గుర్తించారు. ఛార్జింగ్‌ ఫుల్‌ అయ్యాక పొగ వెలువడినట్లు వెల్లడించారు. వాహనానికి మంటలంటుకొని క్రమంగా మిగతావాటికి వ్యాపించాయని నిర్ధారించారు. బ్యాటరీలోని లిథియం అయాన్ రసాయనం కారణంగా భారీగా పొగలు వచ్చాయని నివేదికలో వెల్లడించారు. సెల్లార్‌లోని మెట్ల నుంచి లాడ్జిలోని నాలుగో అంతస్తు వరకు పొగ కమ్ముకున్నట్లుగా తేల్చారు. ఆ పొగను పీల్చుకోవటంతోనే 8 మంది చనిపోయారని.. మరికొందరు అపస్మారకస్థితిలో పడిపోయినట్లు.. వారి రక్షించినట్లుగా తెలిపారు. మంటలు మాత్రం సెల్లార్ వరకే పరిమితమైనట్లు స్పష్టం చేశారు.

12 సెకండ్లలోనే..

బ్యాటరీలు పేలడంతో విషవాయువులు వ్యాపించడంతో ప్రమాద తీవ్రత పెరిగిందనేది నిపుణుల మాట ఎలక్ట్రిక్‌ వాహనాల ఓవర్‌ ఛార్జింగ్‌ మంటలకు కారణంగా భావిస్తున్నారు. మంటల ధాటికి ఒక్కసారిగా బ్యాటరీలు పేలడంతో వాహనాల టైర్లూ కాలిపోయాయి. వాహనాలు, టైర్లు కాలటంతో దట్టమైన పొగ వ్యాపించింది. రెప్పపాటులో ఐదంతస్తుల్లో ఉన్న గదులను పొగ చుట్టుముట్టి లోపలున్న వారిని ఉక్కిరిబిక్కిరి చేసింది. వాటి నుంచి వెలువడిన కార్బన్‌మోనాక్సైడ్‌, లిథియం విషవాయువులు దట్టంగా వ్యాపించాయి.

మంటలు వ్యాపించిన తీరు, కమ్మేసిన పొగ, వ్యాపించిన రసాయనాలు, విష వాయువుల వ్యాపించిన తీరు మష్రూమ్‌ ఎఫెక్ట్‌ అంటారు. సాధారణంగా గాలి ఎక్కువగా లేని బహుళ అంతస్తుల భవనాలు, అపార్ట్‌మెంట్ల సెల్లార్లలో అగ్ని ప్రమాదాల సమయంలో ఇలా జరుగుతుందని వివరిస్తున్నారు. పొగ కనిపించిన 12 సెకండ్లలోనే పేలుడు సంభవించినట్లు సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాల ద్వారా అధికారులు అంచనా వేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం