Telangana: 8వ తరగతి బాలికను గర్భవతిని చేసిన టెన్త్ క్లాస్ బాలుడు.. ఆ తర్వాతే అసలు ట్విస్ట్..

మైనర్ బాలిక...ఇంటి ఎదురుగా ఉండే మైనర్ బాలుడి ఆకర్షణలో పడింది. ఆపై వీరి మధ్య శారీరక సాన్నిహిత్యం ఏర్పడింది. దీంతో బాలిక ప్రెగ్నెంట్ అయ్యింది.

Telangana: 8వ తరగతి బాలికను గర్భవతిని చేసిన టెన్త్ క్లాస్ బాలుడు.. ఆ తర్వాతే అసలు ట్విస్ట్..
Pregnant(representative image)
Follow us
Ram Naramaneni

|

Updated on: Sep 18, 2022 | 1:29 PM

కౌమార దశలో ఉన్న పిల్లల్ని పేరెంట్స్ చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. శారీరక, మానసిక మార్పులు కారణంగా .. టీనేజ్‌లో వారు దారి తప్పే అవకాశం ఉంటుంది. అందుకే ఎప్పటికప్పుడు వారి బాగోగులు తెలుసుకుంటూ ఉండాలి. స్కూల్‌లో విషయాల గురించి చర్చించాలి. తల్లిదండ్రులు.. పిల్లలు స్వేచ్ఛగా మాట్లాడేందుకు  అవకాశం ఇవ్వాలి. లేదంటే మాత్రం వారు ట్రాక్ తప్పే అవకాశం ఉంటుంది. తాజాగా నారాయణపేట జిల్లా(narayanpet district) కోస్గి మండలం(Kosgi Mandal)లో  మైనర్ బాలికను, మైనర్ బాలుడు ప్రెగ్నెంట్ చేసిన ఘటన వెలుగుచూసింది. స్థానికులు తెలిపిన డీటేల్స్ ప్రకారం.. బాలిక తన నానమ్మ వద్ద ఉంటూ స్కూల్‌కి వెళ్తుంది. ప్రజంట్ బాలిక 8వ తరగతి చదువుతుంది. ఈ క్రమంలో ఇంటి ఎదురుగా ఉండే టెన్త్ క్లాసు బాలుడి ఆకర్షణలో పడింది. ఇద్దరి మధ్య చనువు పెరిగి.. శారీరక బంధానికి దారి తీసింది. దీంతో బాలిక ప్రెగ్నెంట్ అయ్యింది. ఇటీవల బాలిక హైదరాబాద్‌(Hyderabad)లో ఉన్న తన పేరెంట్స్ వద్దకు వెళ్లడంతో..  వారు ఆమె కడుపు గుర్తుపట్టి గట్టిగా ప్రశ్నించారు. దీంతో జరిగిన విషయం చెప్పేసింది. దీంతో పరుగుపరుగున గ్రామానికి వచ్చిన బాలిక తల్లిదండ్రులు.. బాలుడు తమ కుమార్తెను పెళ్లి చేసుకోవాలంటూ పెద్ద మనుషుల వద్ద పంచాయతీ పెట్టారు. అయితే బాలుడి తరుఫువారు అందుకు ససేమేరా అన్నారు. దీంతో బాలిక తండ్రి పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేసినట్లు తెలిస్తుంది. ప్రజంట్ బాలిక 7 నెలల గర్భవతి అని సమాచారం.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..