Vijayawada Crime: పెళ్లి పేరిట మహిళా టెకీకి టోకరా! కోటి రూపాయలతో పరారైన ఘరానా మోసగాడు! తెలుగురాష్ట్రాల్లో గాలింపు..

టెకీ ఉద్యోగిని ఘోరంగా మోసపోయింది. ఓ పెళ్లి వెబ్‌సైట్‌లో యువతి ఫ్రొఫైల్‌ చూసి గాళం వేశాడో మాయగాడు. పెళ్లి చేసుకుందాం.. అమెరికా వెళ్దాం.. అందుకు డబ్బుకావాలి..లోన్‌ తీసుకుని, ఆడబ్బు తన అకౌంట్‌కు పంపించమన్నాడు. డబ్బు ట్రాన్స్‌ఫర్ అయ్యాక..

Vijayawada Crime: పెళ్లి పేరిట మహిళా టెకీకి టోకరా! కోటి రూపాయలతో పరారైన ఘరానా మోసగాడు! తెలుగురాష్ట్రాల్లో గాలింపు..
Vijayawada Crime
Follow us
Srilakshmi C

|

Updated on: Sep 18, 2022 | 12:08 PM

AP Crime News: టెకీ ఉద్యోగిని ఘోరంగా మోసపోయింది. ఓ పెళ్లి వెబ్‌సైట్‌లో యువతి ఫ్రొఫైల్‌ చూసి గాళం వేశాడో మాయగాడు. పెళ్లి చేసుకుందాం.. అమెరికా వెళ్దాం.. అందుకు డబ్బుకావాలి..లోన్‌ తీసుకుని, ఆడబ్బు తన అకౌంట్‌కు పంపించమన్నాడు. డబ్బు ట్రాన్స్‌ఫర్ అయ్యాక ముఖం చాటేసాడు. సదరు ఘరానా మోసగాడికోసం తెలుగురాష్ట్రాల్లో పోలీసులు గాలిస్తున్నారు. వివరాల్లకెళ్తే..

విజయవాడలోని, దేవీనగర్‌కు చెందిన యువతి ఎంటెక్‌ పూర్తి చేసి ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో జాబ్‌ చేస్తోంది. వివాహం కోసం ఆమె తన ప్రొఫైల్‌ని పెళ్లి వెబ్‌సైట్లో ఉంచారు. ఈ క్రమంలో ఈ ఏడాది ఏప్రిల్‌ 19వ తేదీన కె శ్రీకాంత్‌ అనే యువకుడు ఆమెకు ఫోన్‌ చేశాడు. వివాహం చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలిపాడు.తాను ఆస్ట్రాజెనికా ఫార్మా కంపెనీలో పని చేస్తున్నానని, ప్రాజెక్టు పనిమీద అమెరికా వెళుతున్నానని చెప్పాడు. వివాహం జరిగాక అమెరికా వెళ్లేందుకు తనను కూడా సిద్ధంగా ఉండాలని సూచించాడు. అందుకు ముందుగానే పాస్‌పోర్టు, వీసా తీసుకోవాల్సి ఉంటుంది. ఇవి తీసుకోవాలంటే సిబిల్‌ స్కోర్‌ 842 పాయింట్స్ ఉండాలని వివరించాడు. శ్రీకాంత్‌ మాయ మాటలు నమ్మిన యువతి తనతోపాటు తండ్రి, సోదరుడి పేర్ల మీద క్రెడిట్‌ కార్డులు, మైక్రో ఫైనాన్స్‌ సంస్థల్లో రుణాలు తీసుకున్నారు. ఈ విధంగా సేకరించిన రూ.1,06,39,000ల డబ్బును హరీష్‌ సంపంగి అనే వ్యక్తి అకౌంట్‌కు పంపించాలని శ్రీకాంత్‌ సూచించాడు. దీంతో యువతి మొత్తం డబ్బును సదరు వ్యక్తి అకౌంట్‌లో వేసింది. అనంతరం యువతి ఫోన్లకు సమాధానం ఇవ్వడం మానేశాడు. దీంతో సెప్టెంబరు 3న యువతి పోలీసులను ఆశ్రయించింది. శ్రీకాంత్‌ ఒక మోసగాడని తెలంగాణ రాష్ట్ర సైబర్‌ సెల్‌ పోలీసులు యువతికి ఫోన్‌ చేసి చెప్పారు. దీంతో మోసపోయానని గుర్తించిన యువతి విజయవాడ సైబర్‌ క్రైం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు ఓ పోలీస్‌ అధికారి మీడియాకు తెలిపారు.