60 ఏళ్ల ప్రియుడ్ని ఏకాంతంగా కలవడానికి రమ్మని చెప్పిన 55 ఏళ్ల ప్రియురాలు.. కానీ ఆ తర్వాత
చాలా కాలం నుంచి వారి మధ్య చాటుమాటు యవ్వారం నడుస్తోంది. తాజాగా ప్రియుడికి ఊహించని ఝలక్ ఇచ్చింది ప్రియురాలు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Andhra Pradesh: వివాహేతర సంబంధాలు, అక్రమ సంబంధాలు ఏదో ఒక రోజు క్రైమ్‌కి దారి తీస్తాయి. అందుకు ఉదాహారణగా నిలిచే ఘటనలు ఇప్పటికే ఎన్నో వెలుగుచూశాయి. గుట్టుగా వ్యవహారం సాగిస్తున్నామని అనుకున్నా.. ఏదో ఒక రోజు ఈ పాడు పనికి చెక్ పడక తప్పదు. నలుగురిలో అల్లరవ్వక తప్పదు. తాజాగా ప్రకాశం జిల్లా(Prakasam District) కొండపి మండలం(Kondapi Mandal) మూగచింతల(Mugachenthala)లో షాకింగ్ ఇన్సిడెంట్ వెలుగుచూసింది. వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ 60 ఏళ్ల వయస్సు గల వ్యక్తి.. ఇప్పుడు ఆస్పత్రి బెడ్‌పై కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్నాడు. అందుకు కారణం.. 55 ఏళ్ల వయసున్న అతడి ప్రియురాలు. అవును.. ఆమే అతడి మర్మాంగాన్ని బ్లేడ్‌తో కోసేసింది. ఎప్పట్లానే ఏకాంతంగా కలవడానికి రమ్మని చెప్పి.. ఈ చర్యకు పాల్పడింది. కాగా వీరిద్దరి మధ్య 10 సంవత్సరాల నుంచి ఈ రంకు యవ్వారం నడుస్తుందని.. స్థానికుల ద్వారా తెలిసింది. ఇద్దరి మధ్య గొడవ జరగడంతో.. ఆమె ఈ పని చేసిందని ఆ ఊరి జనాలు చర్చించుకుంటున్నారు. ప్రజంట్ ఆస్పత్రిలో బాధితుడు చికిత్స పొందుతున్నాడు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు నిందితురాలిపై కేసు ఫైల్ చేసి.. దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..