AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chennamaneni Ramesh: అదీ సంగతి.. అందుకే.. ఇప్పుడు అక్కడ రాజకీయ సందడి..వారి శిబిరంలో తీర్పు కోసం ఉత్కంఠ..

అది ఇప్పటిది కాదు.. 13 ఏళ్లనుంచీ కొనసాగుతున్న వివాదం..ఇటు కోర్టులు..అటు హోం శాఖ కార్యాలయం.. ఈ వివాదంపై విచారణ జరుపుతూనే ఉన్నాయి. అయితే దీనికి త్వరలోనే చెక్‌ పడే అవకాశాలున్నాయట.. హైకోర్టులో పూర్తి స్థాయి విచారణ జరిగిందట. తీర్పును రిజర్వ్‌ చేసిందంట. ఈ తీర్పు కోసమే ప్రతిపక్షాలు ఎదురుచూస్తున్నాయి. మరోవైపు వేములవాడకు ఉప ఎన్నిక జరుగుతుందని కూడా ప్రచారం చేస్తున్నాయి. అధికార పార్టీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌ మాత్రం మౌనంగానే ఉన్నారు. ఇంతకీ తీర్పులో ఏముందో..

Chennamaneni Ramesh: అదీ సంగతి.. అందుకే.. ఇప్పుడు అక్కడ రాజకీయ సందడి..వారి శిబిరంలో  తీర్పు కోసం ఉత్కంఠ..
Chennamaneni Ramesh
Sanjay Kasula
|

Updated on: Sep 18, 2022 | 12:57 PM

Share

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలో 2009 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా చెన్నమనేని రమేష్‌బాబు గెలిచారు. అయితే చెన్నమనేని చేతిలో ఓడిపోయిన కాంగ్రెస్‌ అభ్యర్థి ఆది శ్రీనివాస్‌.. జర్మనీ పౌరసత్వం ఉండగానే.. తప్పుడు పత్రాలతో భారత పౌరసత్వం పొందారంటూ హైకోర్టులో పిటిషన్‌ వేశారు.. అప్పటి నుంచీ ఈ వివాదం, విచారణ కొనసాగుతూనే ఉన్నాయి. కేసు కోర్టులో ఉండగానే టీడీపీ నుంచి టీఆర్ఎస్‌లో చేరిన చెన్నమనేని వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. మరోవైపు పౌరసత్వ వివాదం కేసును అటు హైకోర్టు.. ఇటు కేంద్ర హోంశాఖలు విచారణ జరిపాయి. ఎన్నో సార్లు కేసు వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పటికే పిటిషనర్‌..కోర్టుకు బలమైన ఆధారాలు సమర్పించారు. దీనికి తోడు..చెన్నమనేని 8 నెలల పాటు..ఇండియాలో లేరన్న సాక్ష్యాలు కూడా అందజేశారు. వీటిని పరిశీలించిన కోర్టు.. సుధీర్ఘ విచారణ జరిపి తీర్పును రిజర్వ్‌ చేసిందట. వారంలో తీర్పు వెల్లడించే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు.

అదీ సంగతి.. అందుకే..వేములవాడలో అప్పుడే రాజకీయ సందడి నెలకొంది. పౌరసత్వ వివాదం కొలిక్కి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని ప్రతిపక్షాలు చెబుతున్నాయి. తీర్పు తర్వాత వేములవాడలో ఉప ఎన్నిక జరగడం ఖాయమంటున్నాయి. మరోవైపు.. ఎమ్మెల్యే రమేష్‌ బాబుపై అనర్హత వేటు వేయాలని.. పూర్తి వివరాలతో..కాంగ్రెస్‌ నేత ఆది శ్రీనివాస్‌ ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేశారట.

దీంతో.. హైకోర్టు తీర్పుపై చెన్నమనేని అనుచరులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. తీర్పుపైనే చెన్నమనేని రాజకీయ భవిష్యత్ ఆధారపడి ఉందని చెప్పుకుంటున్నారు. అయితే ఈ కేసు విషయంలో.. రమేష్‌బాబు సుప్రీంకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. అయినా..పట్టువదలని విక్రమార్కుడిలా ఆది శ్రీనివాస్‌ కేసు వెంట పడుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పు ఎలా ఉండబోతోందోనని నియోజకవర్గం మొత్తం టాక్.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం