Viral: ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన మహిళ వీపుపై టేపు.. అనుమానంతో అధికారులు చెక్ చేయగా షాక్
శంషాబాద్ విమానాశ్రయంలో అక్రమంగా బంగారాన్ని తరలించేందుకు ప్రయత్నించిన మహిళను పట్టుకున్న అధికారులు.. భారీగా గోల్డ్ స్వాధీనం చేసుకున్నారు.
Hyderabad: స్మగ్లింగ్ జాదూగాళ్లు రోజురోజుకీ క్రియేటివిటీ పెంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. అధికారులు క్షణ్ణంగా తనిఖీలు చేస్తున్నప్పటికీ.. తమ అతి తెలివితేటలు ప్రదర్శిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా బంగారం అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడటం లేదు. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో.. రెగ్యూలర్‌గా గోల్డ్ పట్టుబడుతూనే ఉంది. విద్యార్థులు ,మహిళలు సైతం విదేశాల నుండి బంగారం అక్రమ రవాణా చేస్తూ.. అడ్డంగా బుక్కవుతున్నారు. తాజాగా తాజాగా దుబాయ్ నుంచి పెద్ద ఎత్తున గోల్డ్ స్మగ్లింగ్ చేసేందుకు యత్నించిన ఓ మహిళను కస్టమ్స్ ఆఫీసర్స్ అరెస్ట్ చేశారు. ఆమె ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో.. అదుపులోకి తీసుకుని చెక్ చేయగా.. 268.4 గ్రాముల గోల్డ్ దొరికింది. పట్టుబడిన బంగారం విలువ రూ.13.73 లక్షలు ఉంటుందని అధికారులు వెల్లడించారు. మహిళ గోల్డ్‌ను పేస్టు రూపంలో టేపులో ఉంచి.. వీపుపై అతికించుకుందని అధికారులు వివరించారు.
On 18.09.2022, the Hyderabad Customs has intercepted one female pax arriving from Dubai by flight 6E 025, who tried to smuggle gold in form of paste by sticking it on her back using adhesive tape. Gold weighing total 268.400 gms valued at Rs. 13,73,403/- was seized pic.twitter.com/Yi8rga2OC2
— Hyderabad Customs (@hydcus) September 18, 2022
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..