Hyderabad: పాతబస్తీలో నడిరోడ్డుపై ఆగిన ఆటో.. ప్రాణ భయంతో పరుగులు తీసిన ప్రజలు.. అసలేం జరిగిందంటే..?
హైదరాబాద్ పాతబస్తీ.. బిజీబిజీగా ఉండే రోడ్డు.. అకస్మాత్తుగా ఆటో ఆగింది.. మొదట డ్రైవర్ పరుగులు తీశాడు.. అంతలోనే ఆటో వెనుక వాహనాలు నిలిపిన వారు.. అక్కడున్న స్థానికులు.. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని.. అక్కడి నుంచి పరుగులు తీశారు..
హైదరాబాద్ పాతబస్తీ.. బిజీబిజీగా ఉండే రోడ్డు.. అకస్మాత్తుగా ఆటో ఆగింది.. మొదట డ్రైవర్ పరుగులు తీశాడు.. అంతలోనే ఆటో వెనుక వాహనాలు నిలిపిన వారు.. అక్కడున్న స్థానికులు.. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని.. అక్కడి నుంచి పరుగులు తీశారు.. అయితే, ప్రాణాపాయం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇంతకీ అసలేమైందంటే.. స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ పాతబస్తీలో సంతోష్ నగర్ చాంద్రాయణగుట్ట ప్రధాన రహదారిపై సిలిండర్ల లోడ్ తో వెళ్తున్న ఆటోలో గ్యాస్ సిలిండర్ లీకైంది. దీంతో ఆటోను రోడ్డుపై వదిలిపెట్టి పారిపోయాడు డ్రైవర్. గ్యాస్ లీక్ కావడంతో ప్రాణభయంతో వాహనాలు వదిలి ఉరుకులు, పరుగులు తీశారు జనాలు. దాంతో.. చాంద్రాయణగుట్ట ప్రధాన రహదారిపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. ఇక.. గ్యాస్ లీకైన సమయంలో ఆటోలో 12 పెద్ద సిలిండర్లు ఉన్నాయి. సమాచారమందుకున్న పోలీసులు.. హుటాహుటిన అక్కడికి చేరుకుని ప్రమాదం జరగకుండా చర్యలు తీసుకున్నారు. పోలీసుల అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది.
అయితే, గ్యాస్ లీకైన వెంటనే ఆటో డ్రైవర్.. ఆటోను వదిలి పారిపోవడంతో వాహనదారులు ప్రాణభయంతో పరుగులు తీసినట్లు పోలీసులు తెలిపారు.. కాంచన్ బాగ్ DRDL ప్రధాన రహదారి పై ఈ ఘటన జరగడంతో ఉక్కసారిగా కలకలం రేపింది. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న ఫలక్ నుమా ట్రాఫిక్ పోలీసులు సంఘటనా స్థలం నుంచి వాహనదారులకు దూరంగా పంపారు.. సిలిండర్ లను ఆటో నుంచి దింపి పక్కన పెట్టారు. ఈ క్రమంలో సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే.. చర్యలు చేపట్టారు. ఫలక్ నుమా ట్రాఫిక్ పోలీసుల సమయస్ఫూర్తితో పెద్ద ప్రమాదం తప్పిందంటూ.. స్థానికులు అభినందించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..