Allu Arjun Arrest: అల్లు అర్జున్ అరెస్టు.. సీఎం రేవంత్‌కు వ్యతిరేకంగా పోస్టులు.. పోలీసుల రియాక్షన్ ఇదే..
డిసెంబర్ 4న అల్లు అర్జున్ పుష్ప2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన జరిగిన విషయం తెలిసిందే.. ఈ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ చనిపోగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్ కు తీవ్రగాయాలయ్యాయి.. ప్రస్తుతం బాలుడి పరిస్థితి విషమంగా ఉంది..
అల్లు వారసుడిగా, మెగా అల్లుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారం ఇటు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది.. డిసెంబర్ 4న అల్లు అర్జున్ పుష్ప2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన జరిగిన విషయం తెలిసిందే.. ఈ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ చనిపోగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్ కు తీవ్రగాయాలయ్యాయి.. ప్రస్తుతం బాలుడి పరిస్థితి విషమంగా ఉంది.. బాలుడు మృత్యువుతో పోరాడుతున్నట్లు పేర్కొంటారు.. కాగా.. ఈ ఘటనలో హైదరాబాద్ పోలీసులు చర్యలు ప్రారంభించారు.. డిసెంబర్ 13న అల్లు అర్జున్ ను అరెస్టు చేశారు.. అరెస్టు అనంతరం అర్జున్ మధ్యంతర బెయిల్ పై విడుదలయ్యారు..
అయితే.. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన విషయంపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది.. అంతేకాకుండా పోలీసులకు కీలక ఆదేశాలిచ్చింది.. అసలు సంథ్య థియేటర్ వద్ద తొక్కిసలాటకు కారణాలేంటి…? ఎవరు బాధ్యులు.. అన్న విషయాలపై తెలంగాణ పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు.. మరోవైపు ఈ ఘటనపై రాజకీయాలు కూడా వేడెక్కాయి.. సంధ్య థియేటర్ ఘటనలో వైఫల్యాలపై.. అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేయడంపై రాజకీయ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అల్లు అర్జున్ అరెస్ట్‌ను విపక్షాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఒక్క కాంగ్రెస్ పార్టీ తప్పా.. మిగతా పార్టీలన్నీ బన్నీ అరెస్టును తప్పుబడుతున్నాయి.
ఈ క్రమంలో హైదరాబాద్ పోలీసులు సంథ్య థియేటర్ తొక్కిసలాట ఘటన, అల్లు అర్జున్ అరెస్టు తర్వాత జరిగిన పరిణామాలపై దృష్టి సారించారు.. అల్లు అర్జున్ ను కావాలనే అరెస్టు చేశారని.. కొంతమంది తెలంగాణ ప్రభుత్వంపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.. అల్లు అర్జున్ అరెస్ట్ తరువాత సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టుల పెట్టిన వారిపై పోలీసులు 4 కేసులు నమోదు చేశారు.. తెలంగాణ ప్రభుత్వం, సిఎం రేవంత్ రెడ్డి పై అభ్యంతరకరంగా అసభ్యకరంగా పోస్టులు పెట్టిన వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు..
పలువురు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసినట్లు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు.. నిందితుల పై ఐటి యాక్ట్ తో పాటు BNS 352,353(1)(b) సెక్షన్ ల కింద కేస్ నమోదు చేశారు.. దీనిపై విచారణ కొనసాగుతుందని పోలీసులు తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..