Hyderabad: దేవుడా! బయట ఏదైనా కొనాలంటేనే భయమేస్తోందిగా! ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో షాకింగ్ విషయాలు
ప్రస్తుతమున్న పరిస్థితుల్లో బయట ఏదైనా కొనాలన్నా, తినాలన్నా భయమేస్తోంది. కారణం కల్తీ. పెద్ద పెద్ద హోటళ్లు, రెస్టారెంట్ల నుంచి చిన్న బడ్డీ కొట్టు దాకా.. అన్నింటిలోనూ కల్తీనే రాజ్యమేలుతోంది. తాజాగా రాజేంద్రనగర్ లోని కొన్ని కిరాణా షాపుల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

రాజేంద్రనగర్ మైలర్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మిగూడలో ఉన్న ఒక కిరాణా దుకాణంలో గడువు ముగిసిన ఆహార పదార్థాలు విక్రయిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం ఆధారంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఒకటి రెండు కాదు ఆ దుకాణంలో ఏ వస్తువు చూసిన ఎక్స్పైరీ అయిన వి మాత్రమే ఉన్నాయి. తనిఖీల సందర్భంగా అధికారులు గడువు ముగిసిన ప్యాకేజ్డ్ ఫుడ్ ఐటమ్‌లను గుర్తించి, వాటిని స్వాధీనం చేసుకున్నారు. దుకాణ యజమానిపై ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) నిబంధనల ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. వినియోగదారుల ఆరోగ్యాన్ని రక్షించేందుకు ఇటువంటి అక్రమాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని అధికారులు హెచ్చరించారు.కాటేదాన్ ప్రాంతంలో వందల కొద్ది చిన్నscale ఫుడ్ పరిశ్రమలు నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా, ఎటువంటి అనుమతులు లేకుండా పిల్లలు తినే చిరుతిండ్లు చిప్స్, కేకులు వంటివి తయారు చేస్తున్నాయి. ఈ యూనిట్‌లు ప్రజారోగ్యంతో ఆటలాడుతూ, కల్తీ పదార్థాలు, అనధికార మెషినరీలతో ఉత్పత్తి చేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. FSSAI టీమ్ ఇటీవల ఇలాంటి యూనిట్‌లపై దాడి చేసి, టన్నుల మొత్తంలో అక్రమ ఉత్పత్తులను ధ్వంసం చేసింది.తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాద్ ప్రాంతంలో కల్తీ ఆహార పదార్థాలపై అధికారులు గతంలో అనేక దాడులు చేశారు.
2025 జూలై, బంజారాహిల్స్ లో ఒక పెద్ద సూపర్ మార్కెట్‌లో గడువు ముగిసిన డెయిరీ ప్రొడక్టులు, కల్తీ మసాలాలు కనుగొని ₹5 లక్షల ఫైన్ విధించారు.2024 అక్టోబర్, కుకట్‌పల్లి లో పిల్లల చిరుతిండ్ల ఫ్యాక్టరీలో కల్తీ కలర్లు, రసాయనాలు జోడించి తయారు చేసిన చిప్స్ యూనిట్ పై దాడి చేసారు. యూనిట్ మూసివేసి, యజమానిపై కేసు నమోదు చేశారు పోలీస్ లు.2025 ఫిబ్రవరి, మల్కాజ్‌గిరి లో స్థానిక కిరాణా దుకాంలలో అడుగడుగనా గడువు ముగిసిన చిప్స్ ప్యాకెట్లు గుర్తించారు. 15 దుకాణాలపై చర్యలు, మొత్తం ₹10 లక్షలు జరిమానా విధించారు.ఈ దాడులు FSSAI ‘ఆపరేషన్ విజన్’ కింద జరిగి, వేలాది కిలోల కల్తీ ఆహారాలను పట్టుకున్నారు. అధికారులు భవిష్యత్తులో డిజిటల్ ట్రాకింగ్, ర్యాండమ్ చెకింగ్ తో మరింత కఠినతర చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ప్రజలు FSSAI యాప్ లేదా హెల్ప్‌లైన్ (1800-11-2100) ద్వారా అ suspect దుకాణాల గురించి ఫిర్యాదు చేయవచ్చు. ఆరోగ్యకరమైన ఆహారం కోసం అలర్ట్‌గా ఉండాలి.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




