AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎండాకాలంలో ఇది ఒక్క గ్లాస్ తాగితే చాలు.. మీ బాడీలో వేడి, మొటిమలకు చెక్.. ఇంకా ఎన్నో..

మారుతున్న జీవనశైలిలో రోగనిరోధక శక్తిని కాపాడుకోవడం ఒక సవాలుగా మారింది. ముఖ్యంగా వేసవి కాలంలో వచ్చే డీహైడ్రేషన్, జీర్ణ సమస్యలకు చెక్ పెట్టాలంటే కలబందను మించిన ప్రత్యామ్నాయం లేదు. కేవలం చర్మ సౌందర్యానికే కాకుండా సంపూర్ణ ఆరోగ్యానికి కలబంద రసం ఎలా సహాయపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..

Krishna S
|

Updated on: Mar 30, 2026 | 6:41 PM

Share
 భానుడి భగభగలు మొదలయ్యాయి. ఎండల తీవ్రత పెరగడంతో బాటు శరీరంలో నీటి శాతం తగ్గి నీరసం, జీర్ణ సమస్యలు తలెత్తుతుంటాయి. ఈ వేసవిలో మనల్ని ఆరోగ్యంగా, తాజాగా ఉంచేందుకు ప్రకృతి ప్రసాదించిన అద్భుత వరం కలబంద. కేవలం చర్మ సౌందర్యానికే కాకుండా ఆరోగ్యానికి కూడా కలబంద మేలని నిపుణులు సూచిస్తున్నారు.

1 / 5
రోగనిరోధక శక్తికి బూస్ట్: కలబందలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, ఇ మరియు బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి రోగనిరోధక శక్తిని పటిష్టం చేస్తాయి. వేసవిలో వచ్చే సీజనల్ వ్యాధులు, ఇన్ఫెక్షన్ల నుండి శరీరాన్ని రక్షించడంలో ఇది రక్షణ కవచంలా పనిచేస్తుంది.

2 / 5
కలబంద రసం తయారీ : మార్కెట్లో దొరికే కృత్రిమ పానీయాల కంటే ఇంట్లోనే తాజాగా తయారుచేసుకునే కలబంద రసం ఎంతో మేలు. తాజా కలబంద ఆకు నుండి గుజ్జును వేరు చేసి, దానిని తగినంత నీటిలో కలపాలి. రుచిని పెంచుకోవడానికి కొద్దిగా నిమ్మరసం, తేనె లేదా నల్ల ఉప్పును కలుపుకోవచ్చు. ప్రతిరోజూ ఉదయాన్నే పరగడుపున ఒక గ్లాసు కలబంద రసం తాగడం వల్ల అత్యంత వేగంగా ఫలితాలు కనిపిస్తాయి. ఒకవేళ మార్కెట్లో దొరికే జ్యూస్‌లు వాడాలనుకుంటే, చక్కెర లేనివి ఎంచుకోవడం ఉత్తమం.

3 / 5
బహుముఖ ప్రయోజనాలు: కలబంద రసం కేవలం శరీరాన్ని లోపల నుండి చల్లబరచడమే కాకుండా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఇది పేగుల్లోని మంచి బ్యాక్టీరియాను పెంచుతుంది. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపి, కాలేయం పనితీరును మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చర్మం సహజమైన మెరుపును సంతరించుకుంటుంది. అలాగే జుట్టు రాలడం తగ్గి, కుదుళ్లు బలంగా మారుతాయి.

4 / 5
ఈ జాగ్రత్తలు తప్పనిసరి: కలబంద రసం ప్రయోజనకరమైనప్పటికీ, అందరికీ ఒకేలా పని చేయకపోవచ్చు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, చిన్న పిల్లలు దీనికి దూరంగా ఉండాలి. తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉన్నవారు దీనిని సేవించే ముందు తప్పనిసరిగా వైద్యుడిని లేదా ఆయుర్వేద నిపుణుడిని సంప్రదించాలి. తక్కువ ఖర్చుతో, సులభంగా లభించే కలబందను మీ దినచర్యలో భాగం చేసుకొని ఈ వేసవిలో మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

5 / 5
Follow Us
తిరుపతికి సమీపంలో అద్భుతమైన హిల్ స్టేషన్..మంచు దుప్పట్లు కప్పిన

బుజ్జి అభిమాని కోరిక తీర్చిన ఎంఎస్ ధోనీ.. వీడియో వైరల్

కోరిన కోర్కెలు తీర్చే కుండలేశ్వరస్వామి.. కాశీకి ముందే..

ముష్కరుల దాడికి ఏడాది.. పెహల్గామ్‌లో ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే

హైదరాబాద్‌లో విచిత్రం..పిండం పెట్టడం కోసం కాకి కొనుగోలు

గాలి వాన ఎంత పనిచేసింది.. పాపం రేవతి..
గాలి వాన ఎంత పనిచేసింది.. పాపం రేవతి..
వారణాసిలో కాబోయే భార్య ఎంపీ ప్రియా సరోజ్‎తో రింకూ సింగ్ సందడి

సిగరెట్ మానేస్తే.. మీ అకౌంట్ లో లక్షలకు లక్షలు..ఎలాగో తెలుసా?

సమ్మర్‌లో సూపర్ బిజినెస్.. 40 రోజుల్లోనే లక్షలు సంపాదన.. ఎలా అంటే

ఓటీటీలోకి వచ్చిన బోల్డ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..