రొయ్యల మసాలా కర్రీని ఇలా వండి తింటే రుచి అదుర్స్ మామా

Prasanna Yadla

30 March 2026

Pic credit - Pixabay

రొయ్యలతో ఏ వంటకం చేసిన తిన్నా కూడా అది టేస్టీగా ఉంటుంది. 

రొయ్యలు

ఇంకా వీటితో రొయ్యల మసాలా కర్రీని వండి తింటే ఆ టెస్ట్ వేరబ్బా..  

రొయ్యల మసాలా కర్రీ

పావు కిలో రొయ్యలు, ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు,  రెండు టమోటాలు, ఒక టేబుల్ స్పూన్  అల్లం-వెల్లుల్లి పేస్ట్ టీస్పూన్, ఒక టేబుల్ స్పూన్ నూనె, ఒక టేబుల్ స్పూన్ కారం, అర టీ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడిను  తీసుకోవాలి.

కావాల్సిన పదార్దాలు

ఇంకా వేయించిన ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, నాలుగు పచ్చి మిర్చి, అర కట్ట కొత్తిమీర, 10 కరివేపాకు ఆకులు, రుచికి సరిపడా ఉప్పును తీసుకోవాలి.

కావాల్సిన పదార్దాలు

ముందుగా రొయ్యలను తీసుకుని వాటిని ఉప్పుతో కానీ, పసుపుతో  కానీ బాగా కడిగి పెట్టుకోవాలి.

స్టెప్ - 1

ఇప్పుడు పాన్‌ పెట్టి దానిలో ఆయిల్ వేసి, తరిగిన ఉల్లిపాయలు వేసి బాగా వేయించుకోవాలి.

స్టెప్ - 2

 అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి దానిలో రొయ్యలు కూడా వేసి 10 నిమిషాలు బాగా వేయించాలి.

స్టెప్ - 3

మాసాలాలు వేసి రుచికి సరిపడా ఉప్పు , టమోటా ముక్కలు వేసి, చివర్లో కొత్తిమీర వేసి దించేయడమే.

స్టెప్ - 4