AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Money Astrology: కేతువు ఆశీస్సులు..ఆ రాశుల వారికి ఆదాయ వృద్ధి పక్కా..!

Ketu Blessings: పాప గ్రహంగా, వక్ర గ్రహంగా, మార్మిక గ్రహంగా పేరున్న కేతువు ప్రస్తుతం సింహరాశిలో తన సొంత నక్షత్రమైన మఖలో సంచారం ప్రారంభించాడు. సొంత నక్షత్రంలో ఏ గ్రహానికైనా బలం రెట్టింపవుతుంది. డిసెంబర్ 5 వరకు కేతువు ఈ నక్షత్రంలోనే సంచారం చేయడం వల్ల కొన్ని రాశుల వారికి ఊహించని శుభ ఫలితాలు కలిగే అవకాశం ఉంది. ఆకస్మిక శుభ పరిణామాలకు, ఆధ్యాత్మిక చింతనకు కేతువు కారకుడు. ఏ రాశివారికీ లాభించని ఈ గ్రహం డిసెంబర్ 5 వరకు మేషం, మిథునం, సింహం, తుల, ధనుస్సు, కుంభ రాశుల వారికి బాగా లబ్ధి చేకూర్చే అవకాశం ఉంది.

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 30, 2026 | 6:16 PM

Share
మేషం: ఈ రాశికి పంచమ స్థానంలో మఖా నక్షత్రంలో సంచరించడం వల్ల కేతువు ఈ రాశివారికి షేర్లు, స్పెక్యులేషన్లలోనూ, వృత్తి, ఉద్యోగాల్లో సమర్థతను నిరూపించుకోవడంలోనూ, సంతాన యోగం కలిగించడంలోనూ బాగా ఉపయోగపడతాడు. జీవితంలో ముఖ్యమైన శుభ పరిణామాలు చేసుకుంటాయి. వ్యయం కంటే ఆదాయం ఎక్కువగా ఉంటుంది. అవమానాల కంటే రాజపూజ్యాలు పెరుగుతాయి. పోటీదార్ల మీద పైచేయి సాధిస్తారు. ఆదాయం పెరిగి ఆర్థిక సమస్యలు తగ్గుతాయి.

1 / 6
మిథునం: ఈ రాశివారికి తృతీయ స్థానంలో సొంత నక్షత్రంలో కేతువు సంచారం వల్ల జీవితంలో అనేక రకాలుగా వృద్ధి, అభివృద్ది చోటు చేసుకుంటాయి. ప్రతి ఆదాయ వృద్ధి ప్రయత్నమూ విజయవంతమ వుతుంది. ఆర్థిక పరిస్థితి ఇతరులకు సహాయం చేసే స్థితిలో ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అంచనాలకు మించిన అభివృద్ధి సాధ్యమవుతుంది. శీఘ్ర పురోగతి కలుగుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి.

2 / 6
సింహం: ఈ రాశిలో కేతువు బలమైన సంచారం వల్ల ఆకస్మిక శుభ పరిణామాలకు ఎక్కువగా అవకాశం ఉంది. జీవనశైలి పూర్తిగా మారిపోతుంది. సగటు వ్యక్తి సైతం సంపన్నుడు కావడం జరుగుతుంది. అనుకోని మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. ఆకస్మిక ధన లాభంతో పాటు, లాటరీలు, జూదాలు, షేర్ల వల్ల డబ్బు సంపాదించడానికి అవకాశం ఉంటుంది. అనారోగ్య సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది. వారసత్వ ఆస్తి సంక్రమించే అవకాశం ఉంది.

3 / 6
తుల: ఈ రాశికి లాభ స్థానంలో కేతువు అనుకూల సంచారం వల్ల జీవితం అనేక విధాలుగా పురోగతి చెందుతుంది. జీవనశైలిలో మార్పు వస్తుంది. కొద్ది ప్రయత్నంతో ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ పెరుగుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆస్తి వివాదం లాభసాటిగా పరిష్కారమవుతుంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లే అవకాశం కలుగుతుంది.

4 / 6
ధనుస్సు: ఈ రాశికి నవమ స్థానంలో కేతువు బలమైన సంచారం వల్ల విదేశీ సంపాదన అనుభవించే యోగం పడుతుంది. విదేశీయానానికి మార్గం సుగమం అవుతుంది. నిరుద్యోగులకు, ఉద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం, ప్రాభవం పెరగడంతో పాటు ఉన్నత పదవులు పొందడానికి అవకాశం ఉంది. వ్యాపారాల దశ, దిశ మారతాయి. పెళ్లి ప్రయత్నాల్లో శుభ వార్తలు వినడం జరుగుతుంది. ఒకటి రెండుసార్లు ధన యోగాలు పట్టే సూచనలున్నాయి.

5 / 6
కుంభం: ఈ రాశికి సప్తమ స్థానంలో సొంత నక్షత్రంలో కేతు సంచారం వల్ల కొన్ని ముఖ్యమైన సమస్యలు, ఒత్తిళ్ల నుంచి బయటపడే అవకాశం ఉంది. ఆదాయం వృద్ధి చెంది ఆర్థిక సమస్యలు చాలా వరకు తగ్గిపోతాయి. కొద్ది ప్రయత్నంతో వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఆర్థికంగా పురోగతి ఉంటుంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఆధ్యాత్మిక విషయాల మీద శ్రద్ధ పెరుగుతుంది. ఉన్నత కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది.

6 / 6
Follow Us
మన పూర్వికులు బలానికి 100ఏళ్ల రహస్యం ఇదే..

బాత్రూమ్ టైల్స్‌పై మొండి మరకలా? ఈ సింపుల్ చిట్కాలతో మెరిపించండి!

రూ.5 ట్రాక్టర్ ఫొటో నోటు మీ దగ్గర ఉందా..? మీరే లక్షాధికారి..

సెప్టెంబర్‌లో పుట్టారా? మీలో ఈ గుణాలు కన్ఫర్మ్ గా ఉంటాయట!

ఇంట్లో డబ్బు, సంతోషం ఉండాలంటే డస్ట్‌బిన్‌ను ఇలా ఉంచాలట!

ఆ స్టార్ హీరో సినిమా కోసం చాలా కష్టపడ్డాం.. కానీ

నేపాల్ శిథిల చిత్రం.. ప్రపంచాన్ని కదిలించిన విచలిత దృశ్యం..

షాపుల్లో నకిలీ QR కోడ్‌ స్టిక్కర్లతో ఘరానా మోసం.. వీడియో చూడండి

రయ్ అంటూ దూసుకెళ్తున్న కారు.. పోలీసులు ఆపగా బయటపడ్డ ట్విస్ట్

మల్లి ఇది నువ్వేనా? RRR ఛైల్డ్ ఆర్టిస్ట్ ఎలా మారిపోయిందో చూశారా?