KTR: CBCID ని అడ్డం పెట్టుకుని పొంగులేటిని కాపాడే ప్రయత్నం చేశారు
పొంగులేటి అవినీతిపై హౌస్ కమిటీ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. సీబీసీఐడీని అడ్డుపెట్టుకొని పొంగులేటిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని, వందల కోట్ల ప్రజా సంపదను ఆయన కుటుంబ కంపెనీ కొల్లగొడుతోందని గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రే తప్పును అంగీకరించినప్పటికీ, మంత్రిని రక్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయని కేటీఆర్ ఆరోపించారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి వ్యవహారంపై బీఆర్ఎస్ లోక్‌భవన్ తలుపు తట్టింది. పొంగులేటి అవినీతిపై హౌస్ కమిటీ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. సీబీసీఐడీని అడ్డుపెట్టుకొని పొంగులేటిని కాపాడే ప్రయత్నం జరుగుతోందని కేటీఆర్ ఆరోపించారు. రక్షించాల్సిన వారే భక్షకులుగా మారితే ఎలా అని ఆయన ప్రశ్నించారు. వందల కోట్ల ప్రజా సంపదను రెవెన్యూ మంత్రి కుటుంబానికి సంబంధించిన కంపెనీ కొల్లగొడుతున్న విషయాన్ని ఆధారాలతో సహా గవర్నర్‌కు సమర్పించినట్లు కేటీఆర్ పేర్కొన్నారు. ఈ అంశాన్ని శాసన సభలో లేవనెత్తినప్పుడు, మా శాసన సభా పక్ష ఉపనాయకుడు హరీష్ రావు ప్రశ్నించినప్పుడు, ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు స్వయంగా నేరం జరిగిందని, తప్పు చేసిందని రాఘవ కన్స్ట్రక్షన్స్ అనే కంపెనీ అని ఒప్పుకున్నారు. కానీ మంత్రిని కాపాడే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ముఖ్యమంత్రి ఎదురుదాడికి దిగి మంత్రి నేరాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని కేటీఆర్ విమర్శించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఉస్మానియా బిస్కెట్లు ఇష్టంగా తింటున్నారా.. ఇది చూడండి
తండ్రికి ప్రేమగా మిల్క్ షేక్ అందించి.. అనంత లోకాలకి పంపిన కుమార్తె..
ఇంటి ఆడపడుచులా.. గోమాతకు సీమంతం !!
చిన్న తప్పుతో నడవలేని స్థితికి చేరుకున్న.. హృతిక్ ప్రియురాలు
భార్య వదిలి వెళ్లిపోయింది.. ‘AI జెమిని’ సలహా ఏంటంటే..
వేసవి వేడికి.. ఏసీ లేకుండానే ఇల్లంతా చల్లగా
ఇన్‌స్టా రీల్ చూసి ఉమ్మెత్త ఆకులు కూర చేసి తిన్నారు.. ఆ తర్వాత
భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా
ఈ నర్స్ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు
లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్
రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్ మెషీన్లో పెట్టి.

