AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యష్‌ ముందుకొస్తే.. విజయ్‌ వెనక్కి జరుగుతారా ??

యష్‌ ముందుకొస్తే.. విజయ్‌ వెనక్కి జరుగుతారా ??

Dr. Challa Bhagyalakshmi
| Edited By: |

Updated on: Mar 30, 2026 | 7:27 PM

Share

కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థ తమ రాబోయే చిత్రాల లైనప్‌పై కీలక ప్రకటన చేసింది. యష్ 'టాక్సిక్' సినిమా ప్రపంచ పరిస్థితుల దృష్ట్యా జూన్ 4కి వాయిదా పడింది. దీని తర్వాతే విజయ్ 'జన నాయగన్' విడుదల కానుంది. సెన్సార్, ఓటీటీ సమస్యలతో ఆలస్యం అవుతున్న 'జన నాయగన్' పై దళపతి ఫ్యాన్స్ నిరాశ చెందారు. జూలైలో విడుదల అయ్యే అవకాశం ఉందని సమాచారం.

మీరు ఎన్నైనా అనుకోండి. ఇంకెన్నైనా ఊహించుకోండి. ఇదీ విషయం.. ఇలా ఉంది లైనప్‌ అంటోంది ఓ నిర్మాణ సంస్థ. అదేంటి? ఇంత క్రేజ్‌ ఉన్న మా స్టార్ మూవీకి లాస్ట్ ప్రిఫరెన్సా? అని కాస్త నిరుత్సాహంలోనే ఉన్నారు దళపతి ఫ్యాన్స్. ఇప్పుడర్థమైంది కదా.. మనం మాట్లాడుకుంటున్న ప్రొడక్షన్‌ హౌస్‌ ఏంటో? ఒక్క మాటతో అందులో ఉన్న లిరిక్స్ తో నేషనల్‌ అటెన్షన్‌ తెచ్చేసుకుంది కేడీ మూవీ. కేవీయన్‌ ప్రొడక్షన్స్ తెరకెక్కిస్తున్న కేడీ – ది డెవిల్‌ సినిమా ఈ ఏడాది ఏప్రిల్‌ 30న విడుదల కానుంది. అనుకున్న ప్రకారమే అన్నీ జరిగి ఉంటే, ఈ నెల 19నే రావాల్సింది కేవీయన్‌ టాక్సిక్‌. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని టాక్సిక్‌ మూవీని వాయిదా వేశారు మేకర్స్. జూన్‌ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది యష్‌ టాక్సిక్‌. మన లాంగ్వేజెస్‌తో పాటు ఇంగ్లిష్‌లోనూ రూపొందుతోంది ఈ మూవీ. టాక్సిక్‌ రిలీజ్‌ అయ్యాకనే జన నాయగన్‌ మీద దృష్టి పెట్టాలనుకుంటున్నారట మేకర్స్. ఆల్రెడీ సెన్సార్‌ ఇష్యూస్‌లో ఉంది జననాయగన్‌. ఆ డిలే కారణంగా ఓటీటీ డీల్స్ లోనూ ఇష్యూస్‌ వచ్చాయంటోంది కోలీవుడ్‌. సో, చక్కదిద్దాల్సిన పనులు ఇన్ని ఉన్నాయి కాబట్టి, జన నాయగన్‌ రిలీజ్‌ని టాక్సిక్‌ తర్వాతే ప్లాన్‌ చేస్తున్నారు మేకర్స్. విజయ్‌ బర్త్ డే మంత్‌లో సినిమా రిలీజ్‌ అవుతుందని మొన్న మొన్నటి వరకు ప్రచారం జరిగింది. కానీ, ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే, సినిమాను జులైకి షిఫ్ట్ చేసే అవకాశం ఉందనే మాటలూ వినిపిస్తున్నాయి. ఈ న్యూస్‌ మాకు కాస్త డిసప్పాయింటే అయినా, మంచి డేట్‌తో సాలిడ్‌ కలెక్షన్లు వచ్చేలా ప్లాన్‌ చేయండి బాస్‌ అని రిక్వెస్టులు పెడుతున్నారు అభిమానులు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఉస్మానియా బిస్కెట్లు ఇష్టంగా తింటున్నారా.. ఇది చూడండి

తండ్రికి ప్రేమగా మిల్క్‌ షేక్‌ అందించి.. అనంత లోకాలకి పంపిన కుమార్తె..

ఇంటి ఆడపడుచులా.. గోమాతకు సీమంతం !!

చిన్న తప్పుతో నడవలేని స్థితికి చేరుకున్న.. హృతిక్‌ ప్రియురాలు

నచ్చకపోతే నచ్చలేదని చెప్పాలి కానీ.. ఇలా చేస్తారా ??

Follow Us