AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: తొలి మ్యాచ్‌లోనే అట్టర్ ఫ్లాప్.. చెన్నై ఫ్యాన్స్‌కు షాకిచ్చిన శాంసన్..!

Sanju Samson: ఐపీఎల్ 2026 సీజన్ మూడో మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున అరంగేట్రం చేసిన సంజు శామ్సన్ అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాడు. ఎంఎస్ ధోనీ గైర్హాజరీలో కీపర్ బాధ్యతలు చేపట్టిన సంజు, కేవలం 6 పరుగులకే వెనుదిరగడంతో సోషల్ మీడియాలో విమర్శల జడివాన కురుస్తోంది. చెన్నై ఫ్యాన్స్ ఆశలపై నీళ్లు చల్లుతూ శామ్సన్ తన పాత ఫామ్‌నే కొనసాగించాడని నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు.

Video: తొలి మ్యాచ్‌లోనే అట్టర్ ఫ్లాప్.. చెన్నై ఫ్యాన్స్‌కు షాకిచ్చిన శాంసన్..!
Rr Vs Csk Sanju Samson
Venkata Chari
|

Updated on: Mar 30, 2026 | 8:50 PM

Share

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరుగుతున్న ఉత్కంఠభరిత పోరులో సీఎస్కేకు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ నిర్ణయాన్ని బౌలర్లు సరైనదిగా నిరూపించారు. కేవలం 5.3 ఓవర్లలోనే 4 కీలక వికెట్లు కోల్పోయి చెన్నై కష్టాల్లో పడింది. మ్యాచ్ ప్రారంభమైన మొదటి ఓవర్ నుండే రాజస్థాన్ బౌలర్లు క్రమశిక్షణతో కూడిన బౌలింగ్‌తో చెన్నై బ్యాటర్లను ఉక్కిరిబిక్కిరి చేశారు. ముఖ్యంగా దక్షిణాఫ్రికా డేంజరస్ పేసర్ నాండ్రే బర్గర్ తన స్పెల్‌తో చెన్నై టాప్ ఆర్డర్‌ను దెబ్బతీశాడు. ఓపెనర్ సంజు శామ్సన్ 7 బంతుల్లో కేవలం 6 పరుగులు మాత్రమే చేసి బర్గర్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాతి కొద్దిసేపటికే ఆయుష్ మ్హత్రే (0) కూడా డకౌట్‌గా వెనుదిరగడంతో చెన్నై శిబిరంలో ఆందోళన మొదలైంది.

శాంసన్ అట్టర్ ఫ్లాప్.. పవర్‌ప్లేలోనే చెన్నై కుదేలు..

140 కిలోమీటర్ల వేగంతో వచ్చిన ఫుల్లర్ లెంగ్త్ బంతిని అక్రాస్ ది లైన్ ఆడే ప్రయత్నంలో సంజు టైమింగ్ మిస్ అయ్యాడు. బంతి నేరుగా ఆఫ్-స్టంప్‌ను ఎగురవేసింది. దీంతో స్టేడియంలోని అభిమానులతో పాటు సోషల్ మీడియాలో కూడా ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది. కొద్దిసేపటికే ‘ఓవర్‌హైప్డ్ ప్లేయర్’ , ‘ఫ్లాట్ ట్రాక్ బుల్లీ’ అంటూ నెటిజన్లు అతడిపై ట్రోల్స్ మొదలుపెట్టారు.

చెన్నై జట్టును ఆదుకుంటాడని ఆశించిన కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. జోఫ్రా ఆర్చర్ విసిరిన అద్భుతమైన బంతికి రుతురాజ్ (6 పరుగులు, 11 బంతుల్లో) క్లీన్ బౌల్డ్ అవ్వడం గమనార్హం. మరోవైపు మాథ్యూ షార్ట్ సైతం సందీప్ శర్మ బౌలింగ్‌లో యశస్వి జైస్వాల్‌కు క్యాచ్ ఇచ్చి కేవలం 2 పరుగులకే నిష్క్రమించాడు. దీంతో 38 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన చెన్నై పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది.

సీఎస్కేలోకి సంజు రాక.. వెనుక పెద్ద కథే ఉంది..!

ఐపీఎల్ 2026 మినీ వేలానికి ముందు ఒక భారీ ట్రేడింగ్ ద్వారా సంజు శామ్సన్ చెన్నై జట్టులోకి వచ్చాడు. రాజస్థాన్ రాయల్స్ మేనేజ్‌మెంట్‌తో విభేదాల కారణంగా సంజు ఆ జట్టును వీడాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం సీఎస్కే తమ స్టార్ ఆటగాళ్లు రవీంద్ర జడేజా, సామ్ కర్రన్‌లను రాజస్థాన్‌కు వదులుకోవాల్సి వచ్చింది.

ధోనీ రిటైర్మెంట్ దగ్గర పడుతున్న తరుణంలో, వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ మాత్రమే కాకుండా భవిష్యత్తు కెప్టెన్‌గా కూడా సంజు సరిపోతాడని చెన్నై యాజమాన్యం భావించింది. అయితే మొదటి మ్యాచ్‌లోనే అంచనాలను అందుకోవడంలో సంజు విఫలం కావడం జట్టును కలవరపెడుతోంది.

Follow Us