AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఐపీఎల్ బెట్టింగ్‌ల జోలికి వెళ్లొద్దు.. సజ్జనార్ వార్నింగ్‌

ఐపీఎల్ బెట్టింగ్‌ల జోలికి వెళ్లొద్దు.. సజ్జనార్ వార్నింగ్‌

Phani CH
|

Updated on: Mar 30, 2026 | 7:04 PM

Share

ఐపీఎల్ ప్రారంభమైన నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు బెట్టింగ్ రాయుళ్లకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. క్రికెట్‌ను కేవలం ఆటలాగే ఆస్వాదించాలని, బెట్టింగ్ ఊబిలో పడి జీవితాలు నాశనం చేసుకోవద్దని కమిషనర్ సజ్జనార్ కోరారు. ఆన్‌లైన్ యాప్‌ల ద్వారా జరిగే మోసాలపై నిఘా పెట్టామని, బెట్టింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. అనుమానాస్పద కార్యకలాపాలను పోలీసులకు తెలియజేయాలని సూచించారు.

ఐపీఎల్-19వ సీజన్ ప్రారంభమైంది. నెలరోజులపాటు క్రికెట్‌ అభిమానులకు పండగే.. ఇక బెట్టింగ్‌ రాయుళ్ల సంగతి చెప్పనక్కర్లేదు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు బెట్టింగ్ రాయుళ్లకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. క్రికెట్‌ను కేవలం ఆటలాగే ఆస్వాదించాలని, బెట్టింగ్ ఊబిలో పడి విలువైన జీవితాలను నాశనం చేసుకోవద్దని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు. బెట్టింగ్‌పై పూర్తిస్థాయిలో నిఘా పెట్టామని, ఎవరైనా బెట్టింగులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికలైన టెలిగ్రామ్, ఇన్‌స్టాగ్రామ్ వంటి యాప్‌ల ద్వారా మోసగాళ్లు…. అమాయకులను ఆకర్షిస్తున్నారని సజ్జనార్ అన్నారు. కొంతమంది ఇన్‌ఫ్లుయెన్సర్లు కూడా ఈ ప్రమాదకరమైన యాప్‌లను ప్రోత్సహించడం ఆందోళనకరమని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో ఇటువంటి బెట్టింగ్‌ల వల్ల ఆర్థికంగా చితికిపోయి, ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. కేవలం ఆన్‌లైన్‌లోనే కాకుండా, రహస్యంగా గదులు అద్దెకు తీసుకుని బెట్టింగ్ నిర్వహించే ముఠాలపై పోలీసులు గట్టి నిఘా ఉంచారన్నారు. ప్రభుత్వం ఇప్పటికే ఇలాంటి కార్యకలాపాలను అరికట్టేందుకు కఠిన చట్టాలను తీసుకువచ్చిందని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. మీ పరిసరాల్లో ఎక్కడైనా బెట్టింగ్ జరుగుతున్నట్లు అనుమానం కలిగితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు. అత్యవసర నంబర్ 100కు కాల్ చేయవచ్చని, లేదా 9490616555 వాట్సాప్ నంబర్‌కు వివరాలు పంపవచ్చని తెలిపారు. చివరిగా మరోసారి విజ్ఞప్తి చేస్తూ “బెట్టింగ్ యాప్‌లకు దూరంగా ఉండండి.. వాటికి నో చెప్పండి” అని ప్రజలకు సూచించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఉస్మానియా బిస్కెట్లు ఇష్టంగా తింటున్నారా.. ఇది చూడండి

తండ్రికి ప్రేమగా మిల్క్‌ షేక్‌ అందించి.. అనంత లోకాలకి పంపిన కుమార్తె..

ఇంటి ఆడపడుచులా.. గోమాతకు సీమంతం !!

చిన్న తప్పుతో నడవలేని స్థితికి చేరుకున్న.. హృతిక్‌ ప్రియురాలు

నచ్చకపోతే నచ్చలేదని చెప్పాలి కానీ.. ఇలా చేస్తారా ??

Follow Us