AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: హైదరాబాద్‌లో ఘోరం.. మద్యం మత్తులో కన్న కొడుకునే కడతేర్చిన తండ్రి.. గుండెలవిసేలా విలపించిన తల్లి

మద్యం మత్తులో ఉన్న సుధాకర్‌ తన కొడుకు బుజ్జగించేందుకు ప్రయత్నించాడు. అయితే ఏం కష్టమొచ్చిందో కానీ ఆ పిల్లాడు ఏడుపు ఆపలేదు. దీంతో విచక్షణ కోల్పోయిన అతను కోపంతో బాలుడిని చితగ్కొట్టాడు. దీంతో జీవన్‌ అక్కడికక్కడే మృతి చెందాడు.

Hyderabad: హైదరాబాద్‌లో ఘోరం.. మద్యం మత్తులో కన్న కొడుకునే కడతేర్చిన తండ్రి.. గుండెలవిసేలా విలపించిన తల్లి
Infant Death
Basha Shek
|

Updated on: Nov 08, 2022 | 10:01 AM

Share

హైదరాబాద్‌ నగరంలో ఘోరం జరిగింది. మద్యం మత్తులో కన్న కొడుకును కడతేర్చాడు ఓ తండ్రి. ఏడుస్తున్నాడనే కోపంతో రెండేళ్ల బాలుడిని అతికిరాతకంగా కొట్టి హతమార్చాడు. హైదరాబాద్‌ లోని నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ నగరంలోని  నేరేడ్మెట్ జే జే నగర్ లోని ఎస్.ఎస్.బి క్లాసిస్ అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్లుగా పనిచేస్తున్నారు దివ్య, సుధాకర్ దంపతులు. అక్కడే నివాసముంటున్నారు. 2019లో ప్రేమ వివాహం చేసుకున్న వీరికి జీవన్‌ అనే రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. కాగా మద్యం అలవాటున్న సుధాకర్‌ సోమవారం రాత్రి ఫుల్లుగా తాగి ఇంటికొచ్చాడు. అక్కడ రెండేళ్ల కుమారుడు ఏడుస్తూ కనిపించాడు. సుధాకర్‌ తన కొడుకు బుజ్జగించేందుకు ప్రయత్నించాడు. అయితే ఏం కష్టమొచ్చిందో కానీ ఆ పిల్లాడు ఏడుపు ఆపలేదు. దీంతో విచక్షణ కోల్పోయిన సుధాకర్‌ కోపంతో దారుణంగా బాలుడిని కొట్టాడు. దీంతో జీవన్‌ అక్కడికక్కడే మృతి చెందాడు.

కాగా భర్త చేతిలో తన కుమారుడు చనిపోయాడని తెలసి తల్లి విలవిల్లాడిపోయింది. కొడుకు మృతదేహాన్ని చూసి గుండెలవిసేలా రోదించింది. ఇది స్థానికులను కూడా కలచివేసింది. కాగా ఈఘోరంపై తల్లి దివ్య నేరేడ్మెట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సుధాకర్‌ ను అదుపులో తీసుకున్నారు. విచారణ ప్రారంభించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
హోటల్ స్టైల్ రవ్వ ఉప్మా రహస్యం..ఇలా చేస్తే అందరూ ఇష్టంగా తింటారు!
హోటల్ స్టైల్ రవ్వ ఉప్మా రహస్యం..ఇలా చేస్తే అందరూ ఇష్టంగా తింటారు!
ఇల్లు వదిలి వెళ్లిన బాలుడు బురద గుంటలో ఇలా.. క్లైమాక్స్ ఊహించలేరు
ఇల్లు వదిలి వెళ్లిన బాలుడు బురద గుంటలో ఇలా.. క్లైమాక్స్ ఊహించలేరు
ఇష్టమైన వాళ్ళు దూరమైన తర్వాతే విలువ ఎందుకు తెలుస్తుంది?
ఇష్టమైన వాళ్ళు దూరమైన తర్వాతే విలువ ఎందుకు తెలుస్తుంది?
ఇది పండుకానీ పండు.. కనిపిస్తే వదలకండి.. ఆ రోగాలకు సూపర్ మెడిసిన్!
ఇది పండుకానీ పండు.. కనిపిస్తే వదలకండి.. ఆ రోగాలకు సూపర్ మెడిసిన్!
ఆవును వెతుక్కుంటూ అడవిలోకి వెళ్ళాడు..! తర్వాత..
ఆవును వెతుక్కుంటూ అడవిలోకి వెళ్ళాడు..! తర్వాత..
బాలయ్య గురించి చాలామందికి తెలియని విషయాలు మీకోసం..
బాలయ్య గురించి చాలామందికి తెలియని విషయాలు మీకోసం..
రూ.1.10 లక్షల కోట్ల భూములకు రక్షణ.. ప్రభుత్వ స్థలాలకు హైడ్రా అండ
రూ.1.10 లక్షల కోట్ల భూములకు రక్షణ.. ప్రభుత్వ స్థలాలకు హైడ్రా అండ
లెజెండరీ డైరెక్టర్ భారతీరాజా కన్నుమూత.. శోకసంద్రంలో సినీ పరిశ్రమ
లెజెండరీ డైరెక్టర్ భారతీరాజా కన్నుమూత.. శోకసంద్రంలో సినీ పరిశ్రమ
ఎలాంటి చర్మ వ్యాధులకైనా ఇది రాస్తే చాలు...
ఎలాంటి చర్మ వ్యాధులకైనా ఇది రాస్తే చాలు...
బస్టాండ్‌లో పడుకున్న పశువుల్ని లేపిన పాపానికి..ప్రాణం బలి!
బస్టాండ్‌లో పడుకున్న పశువుల్ని లేపిన పాపానికి..ప్రాణం బలి!