త్వరలోనే రైతు రుణమాఫీ: మంత్రి నిరంజన్ రెడ్డి
రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే రైతు రుణమాఫీ ప్రారంభిస్తామని తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని ప్రొ. జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో విత్తన మేళా-2019ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. వచ్చే ఏడాది అన్ని కేంద్రాల్లోనూ విత్తన మేళా నిర్వహిస్తామని అన్నారు. రైతుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపడుతామని స్పష్టం చేశారు. వ్యవసాయరంగంలో దేశంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే తెలంగాణ ముందుందని.. రాష్ట్రంలో 46వేల […]
రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే రైతు రుణమాఫీ ప్రారంభిస్తామని తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని ప్రొ. జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో విత్తన మేళా-2019ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. వచ్చే ఏడాది అన్ని కేంద్రాల్లోనూ విత్తన మేళా నిర్వహిస్తామని అన్నారు. రైతుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపడుతామని స్పష్టం చేశారు. వ్యవసాయరంగంలో దేశంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే తెలంగాణ ముందుందని.. రాష్ట్రంలో 46వేల చెరువుల పునరుద్ధరణ విప్లవాత్మక కార్యక్రమమని అన్నారు.