Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో రైలు ఛార్జీల సవరణపై సలహాలు ఇవ్వండి.. అభిప్రాయాలు తెలిపేందుకు 15 వరకు అవకాశం..

హైదరాబాద్‌ మెట్రో రైలు సంస్థ అభ్యర్థన మేరకు ప్రస్తుతమున్న ఛార్జీల సవరణకు కమిటీని ఏర్పాటు చేసింది. మోట్రోలో ప్రయాణికుల నుంచి అభిప్రాయాలను కోరుతోంది. ఎంత వరకు మెట్రో ఛార్జీలను పెంచవచ్చు..? ఎంత పెంచితే ప్రయాణికులు అనుకూలంగా ఉంటుంది..? వంటి అంశాలపై ప్రయాణికుల నుంచి అభిప్రాయాలను తీసుకోనుంది కమిటీ.

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో రైలు ఛార్జీల సవరణపై సలహాలు ఇవ్వండి.. అభిప్రాయాలు తెలిపేందుకు 15  వరకు అవకాశం..
Hyderabad Metro Rail
Follow us

|

Updated on: Oct 31, 2022 | 7:32 AM

భాగ్యనగరంలో మెట్రో రైలు ఛార్జీల పెంపునకు రంగం రెడీ అయ్యింది. హైదరాబాద్‌ మెట్రో రైలు సంస్థ అభ్యర్థన మేరకు ప్రస్తుతమున్న ఛార్జీల సవరణకు కేంద్ర ప్రభుత్వం ఫేర్‌ ఫిక్సేషన్‌ కమిటీ(ఎఫ్‌ఎఫ్‌సీ)ని ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌ మెట్రో రైలులో చార్జీల పెంపునకు ప్రభుత్వం ఫేర్‌ ఫిక్సేషన్‌ కమిటీని ఏర్పాటు చేసింది. విశ్రాంత న్యాయమూర్తి గుడిసేవ శ్యామ్‌ప్రసాద్‌ అధ్యక్షతన ఈ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ అడిషనల్‌ సెక్రటరీ డాక్టర్‌ సురేంద్రకుమార్‌, తెలంగాణ రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ అర్వింద్‌ కుమార్‌ సభ్యులుగా ఉన్నారు.

భాగ్యనగరవాసులపై మరో గుదిబండ పడనుంది. మెట్రో రైలు ఛార్జీల పెంపునకు రంగం సిద్ధమైంది. హైదరాబాద్‌ మెట్రో రైలు సంస్థ అభ్యర్థన మేరకు ప్రస్తుతమున్న ఛార్జీల సవరణకు కమిటీని ఏర్పాటు చేసింది. మోట్రోలో ప్రయాణికుల నుంచి అభిప్రాయాలను కోరుతోంది. ఎంత వరకు మెట్రో ఛార్జీలను పెంచవచ్చు..? ఎంత పెంచితే ప్రయాణికులు అనుకూలంగా ఉంటుంది..? వంటి అంశాలపై ప్రయాణికుల నుంచి అభిప్రాయాలను తీసుకోనుంది కమిటీ.

ప్రస్తుత ఛార్జీల సవరణకు సంబంధించి తమ అభిప్రాయాలు, సలహాలను నవంబరు 15లోగా తెలపాలని కమిటీ ప్రయాణికులను కోరింది. మెయిల్‌ (ffchmrl@gmail.com), ద్వారా గానీ, తపాలా ద్వారా అయితే ఛైర్మన్‌, ఫేర్‌ ఫిక్సేషన్‌ కమిటీ, మెట్రో రైలు భవన్‌, బేగంపేట, 500003 చిరునామాకు పంపాల్సిందిగా కమిటీ మెట్రో ప్రయాణికులను అభ్యర్థించింది.

కమిటీ ఏం చేస్తుందంటే..

మెట్రో రైలు చట్టం ప్రకారం మెట్రో రైలు అడ్మినిస్ట్రేషన్‌(ఎంఆర్‌ఏ)కు మొదటిసారి మాత్రమే ఛార్జీలు పెంచే అధికారం ఉంటుంది. సాధారణంగా మెట్రోని రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తుంటాయి.. అయితే రాష్ట్రప్రభుత్వమే ఎంఆర్‌ఏగా ఉంటుంది. హైదరాబాద్‌లో మెట్రో పీపీపీ విధానంలో చేపట్టారు. ఇక్కడ మెట్రోని నిర్మించి నిర్వహిస్తున్న ఎల్‌ అండ్‌ టీ హైదరాబాద్‌ ఎంఆర్‌ఏగా ఉంది. ఆ మేరకు ఎల్‌ అండ్‌ టీ సంస్థకు, రాష్ట్ర ప్రభుత్వానికి మొదటిసారి మాత్రమే మెట్రో ఛార్జీలను పెంచే అధికారం ఉంది.

ఇక మరోసారి సవరించాలంటే కేంద్రం నియమించే ఫేర్‌ ఫిక్సేషన్‌ కమిటీకి ఆ హక్కు ఉంది. ఫేర్‌ ఫిక్సేషన్‌ కమిటీని నియమించాలని కేంద్రాన్నిరాష్ట్ర ప్రభుత్వం కోరడంతో గత నెలలో కమిటీ ఏర్పాటైంది. అయితే ఈ ఛార్జీలు ఎంత పెంచాలనేది ఇంకా నిర్ణయించలేదు. ఎల్‌ అండ్‌ టీ హైదరాబాద్‌ మెట్రో సంస్థ తమ ప్రతిపాదనలను కమిటీకి అందజేయనుందని హెచ్‌ఎంఆర్‌ఎల్‌ ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి తెలిపారు.

ప్రస్తుత హైదరాబాద్ మెట్రోలో ఛార్జీలు ఇలా ఉన్నాయి..

మొదటిసారి 2017 నవంబరు 28న ఈ ఛార్జీలను నిర్ణయించారు. అప్పట్లో ఎల్‌అండ్‌టీ హైదరాబాద్‌ మెట్రో రాష్ట్ర ప్రభుత్వ ఆమోదంతో ఈ ఛార్జీలను నిర్ణయించింది. ఇందులో టిక్కెట్‌  కనిష్ఠం రూ.10.. గరిష్ఠం రూ.60గా ఫిక్స్ చేశారు. అయితే మెట్రో ప్రయాణికులు ఇచ్చే సలహాలతో ఈ ఛార్జీలను నిర్ణయిస్తారు.

మరిన్ని హైదరాబాద్ న్యూస్ కోసం..