AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టీవీ9 పేరుతో నెట్టింట దుష్ప్రచారం.. అసత్య ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవన్న చానల్ యాజమాన్యం..

TV9 Telugu on Fake News: ‘టీవీ9 తెలుగు’ చానల్ పేరుతో కూడా కొందరు దుష్ప్రచారం చేయడం ప్రారంభించారు. ఇందులో భాగంగానే పోస్ట్ చేసిన ఓ వీడియో ‘టీవీ9 తెలుగు’ లోగో, థీమ్‌తో వైరల్ అవుతోంది. దీన్ని ‘టీవీ9 తెలుగు’ ఖండిస్తోంది. ఇందులో ఎలాంటి వాస్తవం లేదని, పాఠకులు ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మవద్దని కోరుతోంది. ‘టీవీ9 తెలుగు’ పేరును ఉపయోగించి..

టీవీ9 పేరుతో నెట్టింట దుష్ప్రచారం.. అసత్య ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవన్న చానల్ యాజమాన్యం..
TV9 Telugu on Fake News
శివలీల గోపి తుల్వా
|

Updated on: Sep 21, 2023 | 7:29 PM

Share

TV9 Telugu on Fake News: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అవినీతి అరోపణలు ఎదుర్కొంటూ చంద్రబాబు అరెస్ట్ అయిన నాటి నుంచి ఏపీ రాజకీయాలు కాకరేపుతున్నాయి. అధికార, ప్రతిపక్షాల నేతలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడంతో ఆంధ్రా రాజకీయాలు మరింతగా వేడెక్కాయి. అయితే ఇదే అదనుగా భావించిన కొందరు కేటుగాళ్లు త్వరలో నారా లోకేష్‌ని కూడా అరెస్ట్ చేస్తారని తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారు. అంతటితో ఆగక ‘టీవీ9 తెలుగు’ చానల్ పేరుతో కూడా దుష్ప్రచారం చేయడం ప్రారంభించారు. ఇందులో భాగంగానే పోస్ట్ చేసిన ఓ వీడియో ‘టీవీ9 తెలుగు’ లోగో, థీమ్‌తో వైరల్ అవుతోంది. దీన్ని ‘టీవీ9 తెలుగు’ ఖండిస్తోంది. ఇందులో ఎలాంటి వాస్తవం లేదని, పాఠకులు ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మవద్దని కోరుతోంది. ‘టీవీ9 తెలుగు’ పేరును ఉపయోగించి, ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని హెచ్చరిస్తోంది.