AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: హైదరాబాద్‌లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీ.. మంత్రి కేటీఆర్ షాకింగ్ కామెంట్స్..

సెకండ్ ఫెజ్‌లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ కార్యక్రమాన్ని 9 ప్రాంతాల్లో మంత్రులు, మేయర్ ఆధ్వర్యంలో పంపిణీ జరిగింది. దుండిగల్ లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గోన్న మంత్రి కేటీఆర్.. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను చెబుతూనే ప్రతిపక్షాల మాటలకి తనదైన శైలిలో కౌంటర్స్ ఇచ్చారు. పట్టా అందుకున్న ఓ మహిళను ఏం చేస్తావని ప్రశ్నించారు. దానికి స్పందించిన మహిళ.. చాయ్ అమ్ముకుని జీవనం సాగిస్తానంటూ సమాధానం చెప్పింది. అయితే, సమాధానానికి కేటీఆర్ కాస్త పొలిటికల్ టచ్ ఇచ్చి.. ఇన్‌డైరెక్ట్‌గా ప్రధాని మోదీకి పంచ్ వేశారు.

Hyderabad: హైదరాబాద్‌లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీ.. మంత్రి కేటీఆర్ షాకింగ్ కామెంట్స్..
Minister KTR
Yellender Reddy Ramasagram
| Edited By: |

Updated on: Sep 21, 2023 | 6:05 PM

Share

Hyderabad: జీహెచ్ఎంసి పరిధిలో రెండవ విడత డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ కార్యక్రమం మొదలైంది. ఇందులో భాగంగా ఇవాళ మంత్రి కేటీఆర్ అర్హులైన వారికి ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ రెండవ విడత పంపిణీలో భాగంగా ప్రభుత్వం 13,200 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను పంపిణీ చేసింది. అయితే, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీ కార్యక్రమం సందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడిన మంత్రి కేటీఆర్.. ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు.

సెకండ్ ఫెజ్‌లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ కార్యక్రమాన్ని 9 ప్రాంతాల్లో మంత్రులు, మేయర్ ఆధ్వర్యంలో పంపిణీ జరిగింది. దుండిగల్ లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గోన్న మంత్రి కేటీఆర్.. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను చెబుతూనే ప్రతిపక్షాల మాటలకి తనదైన శైలిలో కౌంటర్స్ ఇచ్చారు. పట్టా అందుకున్న ఓ మహిళను ఏం చేస్తావని ప్రశ్నించారు. దానికి స్పందించిన మహిళ.. చాయ్ అమ్ముకుని జీవనం సాగిస్తానంటూ సమాధానం చెప్పింది. అయితే, సమాధానానికి కేటీఆర్ కాస్త పొలిటికల్ టచ్ ఇచ్చి.. ఇన్‌డైరెక్ట్‌గా ప్రధాని మోదీకి పంచ్ వేశారు. ‘చాయ్ అమ్ముకునే వాళ్ళు చాయ్ అమ్ముకుంటే ఏం పర్వాలేదు కానీ, చాయ్ పేరుతో దేశాన్ని మోసం చేయొద్దు’ అని కేటీఆర్ కామెంట్ చేశారు. ఆ మాటలు విన్న మహిళ ఏం అర్థం కాక కాస్త కంగారు పడింది. వెంటనే మహిళను కంగారు పడొద్దని, తాను అన్నది నిన్న కాదంటూ ఆమెకు క్లారిటీ ఇచ్చారు. చాయ్ పేరుతో దేశాన్ని అమ్మేస్తున్న వారి గురించి తాను చెప్పానని వివరణ ఇచ్చారు మంత్రి కేటీఆర్. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి.

దుండిగల్‌లో 1,800 ఇళ్ల పట్టాల పంపిణీ చేశారు మంత్రి కేటీఆర్. ఆ తరువాత కుత్బుల్లాపూర్ 500, సికింద్రాబాద్ కంటోన్మెంట్ 300, సనత్ నగర్ 500, కూకట్ పల్లి 500 ఇళ్లకు పట్టాలు అందచేశారు.

డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సందర్భంగా మంత్రికేటీఆర్ ప్రసంగం..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..