Hyderabad: పాతబస్తీలో మితిమీరిపోయిన మూఢనమ్మకాలు.. సమాధుల దగ్గర చికెన్ ముక్కలు, కోడిగుడ్లు పెట్టి..
Superstitions in Hyderabad: హైదరాబాద్ పాతబస్తీలో మూఢనమ్మకాలు మితిమీరిపోతున్నాయి. మానసిక రుగ్మత, కొద్ది పాటి ఇంటి గొడవ జరిగినా బాబాలను ఆశ్రయిస్తున్నారు కొందరు. అందిందే అవకాశం అన్నట్లుగా మాయ మాటలతో బాబాలు ఇచ్చిన తాయత్తులను ఎక్కడికక్కడ..

Superstitions in Hyderabad: హైదరాబాద్ పాతబస్తీలో మూఢనమ్మకాలు మితిమీరిపోతున్నాయి. మానసిక రుగ్మత, కొద్ది పాటి ఇంటి గొడవ జరిగినా బాబాలను ఆశ్రయిస్తున్నారు కొందరు. అందిందే అవకాశం అన్నట్లుగా మాయ మాటలతో బాబాలు ఇచ్చిన తాయత్తులను ఎక్కడికక్కడ భూమిలో పాతిపెడుతున్నారు స్థానిక మహిళలు. అంతేనా.. సమాధుల దగ్గర చికెన్ ముక్కలు, కోడిగుడ్లు పెట్టి పూజలు చేస్తున్నారు సదరు బాబాలు. దీంతో స్థానికులు బయట కాలు మోపాలంటే భయపడిపోతున్నారు. ఇంకా ఈ దొంగ బాబాలపై వెంటనే చర్యలు తీసుకోవాలిన స్థానికులు వేడుకుంటున్నారు.
ఇదిలా ఉండగా.. దొంగ బాబాల నుంచి స్ఫూర్తి పొందిన స్థానిక స్త్రీలు కూడా ‘ఆమ్ ఫట్’ అంటూ కొత్త అవతారాలు ఎత్తుతున్నారు. స్వతహగా ఆరోగ్య సమస్య వస్తే నేరుగా ఆసుపత్రికి వెళ్తున్న సదరు దొంగ బాబాలు.. ఇతరులకు అదే సమస్యలుంటే తాము చూసుకుంటామని పరిస్థితిని బట్టి డబ్బులు దండుకుంటున్నారు. ఇలాంటి వారి నుంచి దూరంగా ఉండాలని, సమస్య ఉంటే వైద్యుడి వద్దకు వెళ్లాలని కొందరు సూచిస్తున్నారు.




మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..




