Hyderabad: గ్రేటర్లో 56 వేల కుటుంబాలకు రేపటి నుంచి తీరనున్న ఇక్కట్లు

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ ప్రాంత గ్రామాల‌కు నీటి ఇక్కట్లు తీరబోతున్నాయి. రేపటి నుంచే మంచినీటి సరఫరా మొదలై ఇక నుంచి రోజు విడిచి రోజు నీటిని అందిస్తారు...

Hyderabad: గ్రేటర్లో 56 వేల కుటుంబాలకు రేపటి నుంచి తీరనున్న ఇక్కట్లు
Hyderabad Orr Villages
Follow us

|

Updated on: Jun 17, 2021 | 6:07 PM

Greater Hyderabad Driniking Water : హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ ప్రాంత గ్రామాల‌కు నీటి ఇక్కట్లు తీరబోతున్నాయి. రేపటి నుంచే మంచినీటి సరఫరా మొదలై ఇక నుంచి రోజు విడిచి రోజు నీటిని అందిస్తారు. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేర‌కు అద‌నంగా 50 ఎంఎల్డీల నీటిని ఓఆర్ఆర్ ప్రాంత వాసుల తాగునీటి అవసరాలకు కేటాయించారు. ఫలితంగా 56 వేల‌కు పైగా కుటుంబాల‌కు ఇక్కట్లు తీర‌నున్నాయి. గ్రేటర్ తాగునీటి స‌మీక్షా స‌మావేశంలో జ‌ల‌మండ‌లి ఎండీ దాన కిశోర్ ఈ మేరకు వెల్ల‌డించారు.

రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి క‌ల్వ‌కుంట్ల తార‌క రామారావు ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీ వెలుపల ఉన్న ఓఆర్ఆర్ గ్రామాల‌కు (మున్సిపల్ కార్పొరేషన్లకు, మున్సిపాలిటీలకు, గ్రామ పంచాయితీ లకు) ఇప్ప‌టికే స‌ర‌ఫ‌రా చేస్తున్న నీటి కంటే అద‌నంగా 50 ఎంఎల్డీల నీటిని కేటాయిస్తున్న‌ట్లు దాన కిశోర్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఖైరతాబాద్ లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో ఓఆర్ఆర్ ఓ అండ్ ఎం, ట్రాన్స్మిషన్ ఉన్నతాధికారులతో ఆయన సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా దాన కిశోర్ ఆయన మాట్లాడుతూ.. జ‌ల‌మండ‌లి ప‌రిధిలోని జీహెచ్ఎంసీ వెలుపల, ఓఆర్ఆర్ లోపల మొత్తం 7 మున్సిపల్ కార్పొరేషన్ లు, 18 మున్సిపాలిటీలు, 17 గ్రామ పంచాయితీల్లో మొత్తం 193 గ్రామాలు ఉన్నాయని తెలిపారు.  ప్రస్తుతం వీటిల్లో కొన్ని ప్రాంతాలకు రోజు విడిచి రోజు, మరి కొన్ని ప్రాంతాల్లో మూడు నుండి 5 రోజులకొకసారి నీటి సరఫరా జరుగుతుందని వెల్లడించారు. అయితే,  దీంతో ఆయా ప్రాంతాల్లోని ప్రజలు ఇక్కట్లు పడుతున్నారని, ఈ సమస్యను తీర్చడానికి ఆయా ప్రాంతాలకు రోజు విడిచి రోజు నీటిని సరఫరా చేయాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారని తెలిపారు. దానికనుగుణంగా ఈ ప్రాంతాల‌కు ఇప్ప‌టికే స‌ర‌ఫ‌రా చేస్తున్న నీటి కంటే, 50 ఎమ్మెల్డి ల నీటిని అద‌నంగా స‌ర‌ఫ‌రా చేయనున్న‌ట్లు ఎండీ తెలిపారు.

దీనివ‌ల్ల‌ ఆయా ప్రాంతాలలో నివ‌సిస్తున్న‌ 56 వేల‌కు పైగా కుటుంబాలు లబ్ది పొందనున్నట్లు జలమండలి ఎండీ వివరించారు. రేపటినుండే ఈ సరఫరాను ప్రారంభించాలని.. అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆయన సంబంధిత అధికారులను ఆదేశించారు. దీని కోసం ఆయా ప్రాంతాల్లో మంచినీటి స‌ర‌ఫ‌రాను మెరుగుపర్చ‌డానికి కొత్త పైప్ లైన్ నిర్మాణం, మరికొన్ని ప్రాంతాల్లో ఫీడర్ మెయిన్ లు ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు కిశోర్ వెల్లడించారు. ఈ స‌మావేశంలో డైరెక్ట‌ర్ ఆప‌రేష‌న్స్- 2 ఎం. స్వామి, రెవెన్యూ డైరెక్ట‌ర్ వి.ఎల్. ప్ర‌వీణ్ కుమార్, ఓఆర్ఆర్ ఓ అండ్ ఎం, ట్రాన్స్మిషన్ సీజీఎంలు, జీఎమ్ లు , డీజీఎంలు , మేనేజ‌ర్లు పాల్గొన్నారు.

Read also : Podu Farming : వర్షాల రాకతో తెలంగాణలో పోడు పోరు మళ్లీ మొదలు.. నేతలు సైతం రంగంలోకి దిగడంతో అట్టుడుకుతోన్న అడవి తల్లి.!