AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cyberabad Police: బార్లు, పబ్బుల్లో మైనర్లను అనుమతించొద్దు.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

Cyberabad Police: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా హైదరాబాద్ వ్యాప్తంగా కఠిన ఆంక్షలు అమల్లో ఉన్నాయని.. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని సైబరాబాద్ పోలీసులు

Cyberabad Police: బార్లు, పబ్బుల్లో మైనర్లను అనుమతించొద్దు.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
Cyberabad Police
Shaik Madar Saheb
|

Updated on: Dec 30, 2021 | 4:55 PM

Share

Cyberabad Police: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా హైదరాబాద్ వ్యాప్తంగా కఠిన ఆంక్షలు అమల్లో ఉన్నాయని.. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని సైబరాబాద్ పోలీసులు హెచ్చరించారు. ఈ మేరకు గురువారం సైబారాబాద్ పోలీసు కమిషనరేట్ పరిదిలోని బార్లు, పబ్‌ల యజమాన్యంతో పోలీసులు సమీక్ష సమావేశం నిర్వహించారు. నూతన సంవత్సర వేడుకల నియంత్రణను కఠినతరం చేయాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో నిబంధనలను కఠినతరం చేశామన్నారు. మైనర్లను పబ్‌లకు అనుమతించొద్దని, కోవిడ్-19 నిబంధనలను పాటించాలని పబ్, బార్ యజమానులను ఆదేశించారు. సైబారాబాద్ పోలీసు కమిషనర్ సూచనల మేరకు సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ ఎస్ ఎమ్ విజయ్ కుమార్ సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు.

ఓమిక్రాన్‌ భయంతో పబ్‌లు, బార్‌ల యజమానులు ఆరోగ్యశాఖ విధించిన మార్గదర్శకాలను ఉల్లంఘించవద్దంటూ సూచించారు. ఆంక్షలు నిబంధనల ప్రకారం వేడుకలు నిర్వహించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. డిసెంబర్ 31వ తేదీ రాత్రి అన్ని ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తామన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు. నూతన సంవత్సర వేడుకల సమయంలో, తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

శాంతియుత వాతావరణంలో మాత్రమే వేడుకలు జరుపుకోవాలని కోరారు. వేడుకల సమయంలో కరోనా ప్రోటోకోల్‌ను కచ్చితంగా పాటించాలని సూచించారు. ఈ సమావేశంలో మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి, శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి, ఏసీపీలు తదితరులు పాల్గొన్నారు.

Also Read:

DGP Mahender Reddy: రాష్ట్రంలో 2వ తేదీ వరకు సభలు, ర్యాలీలపై నిషేధం: డీజీపీ మహేందర్ రెడ్డి

Vijayawada: బెజవాడలో న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు.. హద్దు దాటితే కఠిన చర్యలు: సీపీ రాణా